ఈ రోజుల్లో పొట్లకాయ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు వారంలో రెండు సార్లైనా పొట్లకాయతో కూర చేసేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పటిలా ఇంటర్నెట్లు, హెల్త్ వెబ్ సైట్స్ లేకపోయినా వాళ్ళకి అది తినటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో బాగా తెలుసు. రోజులు మారేసరికి కూరగాయల వాడకంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఈ రోజుల్లో పిల్లలు పొట్లకాయ తినటానికి అంతగా ఆశక్తి చూపించటం లేదు. దానికి కారణం అందులో ఎన్ని పోషకవిలువలు దాగి ఉన్నాయో తెలియకపోవటమే అయ్యుంటుంది.
పొట్లకాయలో ఉండే పోషకవిలువలు :
- విటమిన్స్ – ఎ,బి మరియు సి
- పిండిపదార్థాలు
- ఖనిజాలు – ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్ మరియు
- మెగ్నీషియం
- సులభంగా జీర్ణమయ్యే ఫైబర్
- నీరు
పొట్లకాయ తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
మధుమేహం యొక్క ప్రభావం తగ్గిస్తుంది :
టైప్-2 మధుమేహంగల వ్యక్తులకు పొట్లకాయ గొప్ప ఆహారపదార్ధంగా ఉంటుంది. ఇది కేలరీలలో తక్కువగా ఉంటుంది మరియు బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుంది. మధుమేహం చికిత్సకోసం, చైనీస్ చికిత్సలో విరివిగా ఉపయోగించే ఈ పొట్లకాయ వాడకం వల్ల, దీనిలోని పోషకతత్వాలు మరియు లక్షణాల కారణంగా డయాబెటిస్ ప్రభావాలు తగ్గుతాయని నిరూపించబడింది.
బిలియస్ మరియు మలేరియా జ్వరాన్ని తగ్గిస్తుంది :
పొట్లకాయతో చేసిన డికాషన్ తీసుకోవడం ద్వారా జ్వరం ప్రభావాలు తగ్గుతాయని చెప్పబడింది. రక్తస్రావం, జ్వరం లేదా వికారం మరియు విరేచనాలు వంటి అంతర్గత శరీర ఉష్ణోగ్రతను పెంచే ఏ జ్వరాన్నైనా తగ్గించే ప్రభావాన్ని పొట్లకాయ కలిగి ఉంటుందని చెప్పబడింది. కొద్దిగా తేనె మరియు ఛిరెట్టా అని పిలవబడే మూలికను పొట్లకాయతో కలిపి తీసుకోవడం ద్వారా బిలియస్ మరియు మలేరియా జ్వరాల చికిత్సలో మరింత ప్రభావవంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కామెర్లు తగ్గుతాయి:
కామెర్లతో బాధపడుతున్న వారు తేలికపాటి మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవలసి ఉంటుంది. కొత్తిమీర, పొట్లకాయ ఆకులను కలిపి తీసుకోవడం కామెర్ల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. బైలిరూబిన్ స్థాయిలను తగ్గించి, కామెర్ల చికిత్సకు ఎంతగానో దోహదం చేస్తుంది. రోజులో మూడు సార్లు కనీసం ఈపానీయం తీసుకోవలసి ఉంటుంది. గృహచికిత్స అయినా అద్భుతంగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :
పొట్లకాయలోని పోషకపదార్ధాలు హృదయ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను అరికట్టడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా తలనొప్పి వంటివి. మరియు నాడీ వ్యవస్థను క్రమబద్దీకరించడం ద్వారా రక్తపోటును సైతం తగ్గించగలదు. ఒత్తిడి మరియు హృదయ సంబంధిత నొప్పిని తగ్గించడంలో పొట్లకాయలోని విటమిన్లు ఖనిజాలు అద్భుతంగా సహాయపడగలవు. హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి రోజులో కనీసం 2కప్పుల పొట్లకాయరసం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన.
మలబద్ధకం ను తగ్గిస్తుంది :
మలబద్ధకం, ఆహారంలో నీరు మరియు ఫైబర్ లేకపోవడం మరియు సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం మొదలైన కారణాల వలన వస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, డయాబెటిస్, ప్రేగు ప్రకోప సిండ్రోమ్, మొదలైనవి తీవ్రమైన అనారోగ్య స్థితి లక్షణాలుగా కూడా ఉంటాయి. మీ ప్రేగుకదలికను మెరుగుపరుచుకోవడానికి ప్రతి ఉదయం 1-2 టీస్పూన్స్ పొట్లకాయ రసాన్ని తీసుకోవలసిందిగా సూచించబడింది. ఇది లాక్సేటివ్ వలె పనిచేసి, మలబద్దక సమస్యను దూరంచేయగలదు.
బరువును క్రమబద్దీకరిస్తుంది :
పొట్లకాయ తక్కువ కేలరీలతో ఉండడమే కాకుండా, కొవ్వుపదార్థాలు లేని కూరగాయగా కూడా ఉంటుంది. నీరు మరియు ఫైబర్తో పాటు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. తద్వారా బరువును క్రమబద్దీకరించడంలో అద్భుతంగా సహాయం చేస్తుంది. మీరు బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే మీ ఆహారంలో పొట్లకాయను జోడించడం ఉత్తమం.
చర్మం లోపాల నివారణలో :
అలోపేసియా వంటి చర్మలోపాల అదనపు ఒత్తిడి వల్ల లేదా మీ రోగనిరోధక వ్యవస్థ తగ్గుదల వలన, మీ జుట్టు ఫొలికల్స్ మీద ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి యొక్క ప్రధాన లక్షణం జుట్టు రాలడం. ఇది తాత్కాలిక లేదా శాశ్వత సమస్యగా మారవచ్చుకూడా. మీరు ఈ పరిస్థితి కారణంగా బాధపడుతున్నట్లయితే మీ జుట్టు ప్రభావిత ప్రాంతాల్లో పొట్లకాయరసాన్ని అప్లై చేయడం ద్వారా ప్రయోజనాల్ని పొందగలరని నిపుణులు చెబుతున్నారు.