Home Health మొలకెత్తిన గింజలు ఆహారంలో కలిపి తింటే ఏమవుతుంది?

మొలకెత్తిన గింజలు ఆహారంలో కలిపి తింటే ఏమవుతుంది?

0

మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే విటమిన్లు,ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మొలకెత్తిన గింజలను ప్రతీరోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా లాంటి జబ్బుల బారిన పడకుండా ఉండవవచ్చని ప్రముఖ డైటీషియన్స్ చెబుతున్నారు.

మెులకెత్తిన గింజలుశనగలు, పెసలు, అలచందలు, వేరుశెనగపప్పులు లాంటి గింజ ధాన్యాలను నీటిలో నానేసి, వాటికి మొలకలు వచ్చిన తర్వాత అట్లాగే తినవచ్చు. అదనపు రుచికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వాటిల్లో కలిపి, చిటికెడు ఉప్పు వేసి తినవచ్చు. కొంతమంది మొలకగింజలను ఉడికించి, వాటికి తాలింపు పెట్టి తింటారు.

అయితే, మొలకగింజలను, ఆవిరి మీద ఉడికించడం మంచిది. నీళ్ళల్లో ఉడికించాలనుకుంటే, గింజలు మెత్తబడటానికి సరిపడేటంత నీటిని మాత్రమే పోయాలి. నీటిని ఎక్కువగా పోయడం వల్ల వాటిలోని పోషక పదార్ధాలను నష్టపోతాయి. ఫాస్ట్‌ ఫుడ్స్‌, చిరుతిళ్ళు తినే కంటే మొలకెత్తిన గింజలను తినడమే ఆరోగ్యానికి మంచిది.

మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాగే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాల సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీను నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. వీటి వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. కాబట్టి రోజువారి ఆహార ప్రణాళికలో మెులకెత్తిన గింజలను చేర్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొలకగింజల్లో శరీరానికి అవసరమయ్యే ఫైబర్‌, కాల్షియం, ప్రోటీన్స్‌, జింక్‌, ఓమేగా 3 ఫాటి ఆసిడ్స్‌, నీరు, విటమిన్‌ సి లభిస్తాయి. శరీరంలో ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతుంది. ప్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. మొలకెత్తిన గింజలు హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని ద్వారా గుండె నొప్పిలాంటి సమస్యలు ఉండవు. వాటిలో ఉండే ఫైటోఎరోజెన్ నిల్వలు, గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్ ‘C’ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాలు శక్తివంతంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచగలుగుతుంది.

మొలకెత్తిన గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాటిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చూసి ఆకలి తొందరగా కలగకుండా చేస్తుంది. వేరుశనగ మొలకలు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్న మహిళల్లో కొవ్వును తగ్గించగలగుతుంది.

అయితే చాలామంది ఉదయాన్నే మొలకెత్తిన గింజలను ఆరగిస్తుంటారు. ఇది మంచి అలవాటే. కానీ, మొలకెత్తిన గింజలను రోజువారి ఆహారంలో కలిపి తీసుకున్నట్టయితే మరింత మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను సృష్టిస్తాయి.

ఆహారంలో సాధారణంగా వాడే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు ఎక్కువగా వుంటాయి. పప్పులు, ధాన్యలలో మాంసకృత్తులు వుంటాయి.మొలకెత్తినప్పుడు నీటిలోని మాంసకృత్తులలో మార్పువచ్చి నాణ్యత పెరుగుతుంది. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి అత్యవసర ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది.

Exit mobile version