చలికాలంలో ఉసిరిని కచ్చితంగా తినాలట, ఎందుకో తెలుసా?

శీతాకాలంలో చలిని ఎదుర్కోవడంతో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చలికాలం వచ్చిందటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను వెంట తీసుకువస్తుంది. జలుబు, తుమ్ము, దగ్గు, జ్వరం లాంటివి పిలవకుండానే వచ్చేస్తాయి. అయితే.. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సీజ‌న‌ల్ ఫ్రూట్స్ ను ఎప్ప‌టికీ దూరం పెట్టొద్దు ఎక్క‌డినుంచైనా తెప్పిచ్చుకుని తినాలి. దాంతో మ‌న ఆరోగ్యం మంచిగా ఉండ‌ట‌మే కాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. దాంతో ఏ రోగాలు మ‌న ద‌గ్గ‌ర‌కు చేర‌వు. అందులో ఉసిరి  ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ కాలంలో లభించే ఆహారపదార్ధాలలో ఉసిరికాయ ఒకటి. ఉసిరికాయను శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు మనం పొందవచ్చు. ఉసిరిని పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విరివిగా వాడేవారు. దీంతో మాత్రలను తయారుచేసేవారు. ఉసిరిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. అంతేకాదు.. ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది. మెరుగైన మెటబాలిజం నిర్వహించడానికి సహాయపడుతుంది. మరి ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
ఉసిరికాయలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది దానితో పాటుగా ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయలకన్నా…ఉసిరికాయల్లో సీ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. నిమ్మ తింటే జబులు చేస్తుంది కానీ అలా ఓ ఉసిరికాయను నోట్లో వేసుకోవచ్చు. దాంతో విటమిన్‌ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా చూస్తుంది.  ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.
ఇక చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ మందగిస్తుంది. మలబద్దకం వస్తుంది. అలాంటప్పుడు ఉసిరికాయ జ్యూస్ తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.  ఉదర సంబంధిత అనేక సమస్యలను నివారించడంలో ఉసిరి కీలకంగా వ్యవహరిస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
గుండె రోగులకు కూడా ఉసిరి వినియోగం చాలా మేలు చేస్తుంది. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది నాళాలలో అడ్డంకిని తొలగిస్తుంది. గుండె జబ్బులున్నవారు ఉసిరిని తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి.
శీతాకాలంలో జుట్టు రాలడం తీవ్రమవుతుంది. అయితే ఉసిరి జట్టు రాలడాన్ని అరికట్టి బలంగా మారుస్తుంది. ఆమ్లాలోని పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. నోటిలో తరచుగా పొక్కులు వస్తుంటే ఖచ్చితంగా ఉసిరి తినాలి. ఉసిరి రసం పొట్ట సమస్యలను దూరం చేయడంతో పాటు వేడిని తగ్గిస్తుంది. ఇది అల్సర్లలో ఉపశమనం కలిగిస్తుంది.
మరి చలికాలంలో ఉసిరికాయను ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం… చలికాలంలో ఉసిరి పొడిని తీసుకోవచ్చు. ఒక చెంచా ఉసిరి పొడిని వేడి నీటిలో, తేనెలో కలపి తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. లేదా ఉసిరి రసం కూడా తీసుకోవచ్చు. ఒక చెంచా ఉసిరి రసాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలపి తాగాలి.
ఉసిరికాయ పచ్చడి లేదా మురబ్బాను కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఆమ్లా మిఠాయిని కూడా తయారు చేసుకొని తినవచ్చు. దీని కోసం ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బెల్లం పాకాన్ని కలిపి ఆమ్లా మిఠాయిని తయారు చేసుకోవచ్చు. ఉసిరిని క్యాప్సూల్స్‌గా, జామ్, జ్యూస్ లేదా ఎలాగైనా తినవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR