మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలు

దాదాపు అందరి ఇళ్లల్లోనూ కనిపించే మందార పువ్వులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. అయితే ఆడవారికి మరింత సౌందర్యానిచ్చే మందారలో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మందార ఆకు, పువ్వులు, వేర్లల్లో ఉన్న ఔషధ గుణాల కారణంగా పూర్వకాలం నుంచే ఎన్నో ఆయుర్వేద మందుల్లో మందారను వాడుతున్నారు. చైనీస్ మందుల్లోనూ శతాబ్ధాలుగా వినియోగిస్తున్నారు.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుమందారంలో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా మందార పువ్వులు మహిళల గర్భసంచికి ఎంతో మేలు చేస్తాయి. గర్భసంచి సమస్యలు, వయసు మీద పడినా మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యలకు మందార పూరేకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుమందార పూ రేకులను పేస్ట్ చేసుకుని మజ్జిగలో కలిపి రోజూ తీసుకుంటే మహిళల్లో గర్భసంచి సమస్యలు దూరమవుతాయి. ఇంకా నెలసరి సమస్యలు మటుమాయమవుతాయి. మందార పువ్వుల్ని నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే నెలసరి సమయంలో ఏర్పడే పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుమందారలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. యూరినేషన్ పెరుగుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. మందారంలోని క్వెర్సెటిన్ రక్తపోటును తగ్గిస్తుంది. రక్త నాళాల విస్ఫోటనాన్ని ప్రోత్సహిస్తుంది. మందార దాని యాంటీ-ఆక్సిడెంట్ గుణాల వల్ల గుండె కండరాల కణాలను కూడా రక్షిస్తుంది.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుహృద్రోగ వ్యాధిగ్రస్థులు మందార పూవు రేకులు, తెలుగు తామర పువ్వుకు చెందిన రేకుల్ని కషాయంలా సేవిస్తే గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గల మలినాలను తొలగిస్తుంది. ఇంకా అజీర్ణానికి చెక్ పెట్టాలంటే నోటిపూతను దూరం చేసుకోవాలంటే రోజూ ఐదు లేదా పది మందారపువ్వుల్ని తీసుకోవడం ఉత్తమం. మందార కార్డియోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుమందారాలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడి ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. వీర్య కణాల సమస్యతో బాధపడేవారు ఈ మందార పొడిని రెండు స్పూన్లు నోట్లో వేసుకుని గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా నలబై రోజుల పాటు తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చు.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుహిబిస్కస్ యాంటీ డిప్రసెంట్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులలో ఫ్లేవనాయిడ్స్ మనలో ఉండే నెగెటివ్ థింకింగ్‌ను దూరం చేస్తుంది. బాధలో ఉన్నప్పుడు గానీ, ఒత్తిడిలో ఉన్నా గానీ.. కప్పు మందార టీ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది. మందార టీ తాగడం వల్ల మనస్సు, శరీరంలో రిలాక్స్డ్ సంచలనం ఏర్పడుతుంది. మందార టీలో ఫ్లేవనాయిడ్లు ఉండటం దీనికి కారణం. అలాగే మందార టీ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మందార ఆకులు వలన కలిగే ప్రయోజనాలుఅతినీలలోహిత కిరణాలు, కాలుష్యం నుంచి చర్మానికి రక్షణ ఇస్తుంది. శరీరంపై ముడతలను తగ్గించి నిత్య యవ్వనంగా ఉంచుతుంది. మందార పువ్వులను ఎండలో ఆరబెట్టి ఇంట్లో నిల్వచేసుకోవాలి. 2 లేదా 3 టీ స్పూన్‌లో ఎండిన మందార రేకులను 2 కప్పుల నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. వడగట్టిన తర్వాత రుచి కోసం కాస్త తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. వేడి వేడి తాగితే..చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇంకా మందార పువ్వు పొడిని మాడుకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రుకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR