Home Health తేనే వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

తేనే వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి చర్మ సమస్యలు ఎదుర్కునే కంటే ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. వీటికి ఎక్కువ ఖర్చు కూడా చేయవలసిన అవసరం లేదు. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మార్చేందుకు ఇంట్లోనే చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తేనే అందులో మొదటిది.

తేనే వలన చర్మానికి కలిగే ప్రయోజనాలుచర్మానికి తేనే రాయటం వలన త్వరగా ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కారణం ఇది ‘యాంటీ-బ్యాక్టీరియా’ గుణాలను కలిగి ఉండటం. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది. తేనెను వివిధ కారణాల వల్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్లతో చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది.

మొటిమలు తొలగించడంలో తేనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. మొటిమలు తొలగించడం కోసం ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. తరువాత ముఖానికి తేనె రాసి 2 నుండి 3 నిమిషాలు మసాజ్ చేయండి. కాసేపటి తర్వాత ముఖం కడగాలి. వారానికి 2 నుండి 3 సార్లు ఇలా చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

తేనే ముఖానికి ఏ కాలంలోనైనా మెరుపునిస్తుంది. రోజుకి రెండు సార్లు తేనెను ముఖానికి అప్లై చేస్తే కొన్ని రోజుల్లోనే మంచి మెరుపు వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, ఒక చిటికెడు పసుపు పొడి మరియు ఒక టీస్పూన్ గంధపు పొడి ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూయండి, 10-15 నిమిషాలు నానబెట్టి, ఆపై ముఖాన్ని కడగాలి. చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి వారానికి 2 సార్లు ఇలా చేయండి.

చర్మం పొడిగా ఉన్నవారు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పాలు మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. దాన్ని నెమ్మదిగా ముఖం మీద రాయండి. ముఖం మీద పూసిన మిశ్రమం బాగా ఎండిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. తేనె మరియు పాలు సహజ మాయిశ్చరైజర్లు మరియు పాలలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, దీన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా, మీరు చర్మం పొడిబారడాన్ని తొలగించి తేమను నిలుపుకోవచ్చు.

తేనె నేచురల్ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అలాగే యాక్ని కూడా పూర్తిగా తగ్గి పోతుంది. తేనె తో ఇంట్లోనే మాస్కులు మరియు స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీంతో మీరు మరింత అందంగా కనపడతారు. పైగా తేనెని ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి కలగవు. అయితే ఈ తేనే ను ఉడకబెట్టిన క్యారెట్ కు కలిపి రాసుకుంటే మరింత త్వరగా మేని మెరుపుని సంతరించుకుంటుంది.

ఇక జిడ్డు చర్మం ఉన్నవారు కూడా తేనెను ఉపయోగించవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ముల్తానీ మీడ్ పౌడర్, అర టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి. రెండింటినీ పేస్ట్ రూపంలో కలపండి. ఆ పేస్ట్‌ను ముఖానికి రాయండి. దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా తరుచూ చేస్తూ ఉంటే ముఖంపై ఉండే జిడ్డు తగ్గిపోతుంది.

ఒక చిటికెడు పసుపు పొడి, అర టీస్పూన్ గ్లిజరిన్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది ముఖం మీద తేమను నిలుపుకుంటుంది మరియు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. జిడ్డు లేని తేమ పాలు, హైడ్రా-ఓదార్పు ద్రవం, షియా బటర్ మరియు నేరేడు పండు కెర్నల్ నూనెతో చర్మాన్ని మరమ్మతులు చేసి, పోషిస్తుంది. పసుపు చర్మం రంగు పెంచడానికి సహాయపడుతుంది.

గుడ్డులోని తెల్లసొనలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. వారానికి ఒకసారి ఇలా చేయండి. గుడ్లలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి, ముడతలు తొలగించి యవ్వన రూపాన్ని ఇస్తాయి. ముఖం మీద ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది.

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది గాయాలను మాన్పించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా గాయాలు అయితే తేనే ఉపయోగించండి. గాయం మీద తేనె రాస్తే త్వరగా హీలింగ్ అవుతుంది.

 

Exit mobile version