ఆరోగ్యానికి ఆకు కూరలు చేసే మేలు ఏంటో తెలుసా ?

ఆకు కూరలు అనగానే కొంత మంది ముఖం తిప్పుకుంటారు. కానీ పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహారం. అనేక రకాల ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరి వేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. ఉదా పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి మొదలైనవి. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది

ఆకు కూరలుమనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తుంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి.

ఆకు కూరలుఇవి తొందరగా నలిగే గుణం ఉండటం వల్ల సలాడ్‌, సూపులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకు కూరలు వండే సమయంలోమూతలు పెట్టి వండండి. వీలైనంతవరకు ప్రెజర్‌ కుక్కర్‌లోనే వండేందుకు యత్నిస్తే వాటిలోనిపోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండి. కాస్తనిమ్మరసం, ఉప్పు,కలిపి సూప్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇంతే కాదు, ఆకుకూరల్లోని మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు గురించి తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

ఆకు కూరలుడైటర్స్ కోసం ఆకుకూరాలు ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు చాలా తక్కువగా బ్లడ్ గ్లూకోజ్ లు కలిగి ఉంటాయి. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే ఏమాత్రం సంకోచించకుడా ఆకుకూరలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ఆకు కూరలుఆకుకూరల్లో విటిమిన్ ఎ, కె మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది మరియు శాస్వ సంబంధిత సమస్యలను, యూరినరీ మరియు పేగు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

శాస్వ సంబంధిత సమస్యలఒక కప్పు ఆకూరలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని మీ దరిదాపుల్లో చేరనివ్వదు. మలబద్దకం నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి ఆకుకూరలు. ఆకుకూరల్లో డైటరీ ఫైబర్ ఫుష్కలంగా ఉండీ మీ జీవక్రియను శుభ్రం చేస్తుంది. ఆకుకూరలు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆకుకూరల్లోని విటమిన్స్ మరియు మినిరల్స్ హైబ్లడ్ ప్రెజర్ ను నివారించడానికి మరియు ఇతర సమస్యను నిరోధించడానికి బాగా సహాయపడుతాయి.

మలబద్దకాన్నిఆకుకూరల్లోని అనేక ఫ్లేవనాయిడ్, ఫైటోన్యూట్రియంట్స్ కు ఇవి చాలా అవసరం. ఇవి యాంటీక్యాన్సర్ గుణాలను కలిగి ఉండి ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఆకుకూరల్లోని మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచేదుకు బాగా సహాయపడుతుంది. అలాగే ఆకుకూరల్లోని ఫొల్లెట్, కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Cancerఆకుకూరల్లోని కెరోటినాయిడ్స్ మనకు తెలిసిన ల్యూటిన్ మీ జీవక్రియల్లో కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. అయితే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రతి రోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

Cholesterolఆకు కూరలలో కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ ‘ఎ’గా మారుతుంది. విటమిన్‌ ‘ఎ’ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు వీటిలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ స్కిన్ మాయిశ్చరైజ్ గా అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలు, మచ్చలు, రాషెస్ వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతాయి. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది. ఆకుకూరల్లోని ల్యూటిన్ కళ్ళకు రక్షణగా ఉండి కాంటాక్ట్ మరియు ఏజ్ రిలేటెడ్ కళ్ళ సమస్యను నివారిస్తుంది.

Eyesఆకుకూరల్లో సెలీనియం, నియసిన్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యకరమైన మెదడుమరియు నరాల బలహీనతను తగ్గిస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR