బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక్కసారి రుచి చుడండి!

మనుగడ సాగించడం కోసం ఏది దొరికితే అది తినడం వల్ల ఏదోలా బ్రతికి వెళ్లిపోతాం. కానీ శరీరానికి ఏది మేలు చేస్తుందో దాన్ని ఎంచుకోవడం వలన ఆరోగ్యంగా ఎటువంటి రోగాలు లేకుండా బ్రతకొచ్చు. ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మనం తినే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తాం. పాజిటివ్ ప్రాణిక్ ఆహారం, నెగిటివ్ ప్రాణిక్ ఆహారం మరియు జీరో ప్రాణిక్ ఆహారం.

4-Mana-Aarogyam-784పాజిటివ్ ప్రాణిక్ అంటే దాన్ని తీసుకున్నప్పుడు మన శరీరానికి కొంత ప్రాణ శక్తిని అందిస్తుంది. నెగిటివ్ ప్రాణిక్ ఆహారం అంటే అది మన వ్యవస్థలోని శక్తిని తగ్గిస్తుంది. జీరో ప్రాణిక్ అనేది పెంచదు, తగ్గించదు. దీన్ని కేవలం రుచికోసం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి పాజిటివ్ ప్రాణికి ఆహారం తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ప్రాణశక్తిని అందిస్తుంది.

అలాంటి ఒక ఆహారం బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ చాలా ప్రాణహిత మైన ఆహారం. కాయగురలలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడి కాయ ఒక్కటే. అందుకే నరదిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయను గుమ్మానికి కడుతూ ఉంటారు. చలికాలంలో పిందె తొడిగి, వేసవి వరకూ పెద్దపెద్ద కాయలు కాసే ఈ గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు.

6-Mana-Aarogyam-784అంతేకాదు, నీరు ఎక్కువుండే బూడిదగుమ్మడిలో కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో డైటింగ్‌ చేసే వారికి మంచి ఆహారం. కానీ మనం దానిని తినడం లేదు. అయితే దీన్ని తప్పకుండా తినాలి ఎందుకంటే బూడిదగుమ్మడి కాయలలో చాలా ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది. అంతటి ప్రాణశక్తి ఉన్నప్పుడు మన లోపలికి తీసుకోవడం మంచిదే కదా. ఒకవేళ నేరుగా తినలేము అనుకుంటే జ్యూస్ చేసుకొని తగ్గొచ్చు.

మరి బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ముందుగా గుమ్మడికాయని కట్ చేసుకుని అందులోని లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని జ్యూస్లాగా చేసుకోవాలి. తర్వాత ఈ జ్యూస్ ని వడగట్టుకుని తాగొచ్చు. లేదా కొద్దిగా తేనెను కలుపుకొని కూడా తాగవచ్చు.

8-Mana-Aarogyam-784ఈ గుమ్మడికాయ చూసిన రోజు పరగడుపున తీసుకుంటూ ఉంటే శరీరంలో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ కాలరీలు కరుగుతాయి. కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనిస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది ఆకలిని నెమ్మది నెమ్మదిగా తగ్గేటట్టు చేస్తుంది. జీర్ణశక్తిని రెట్టింపు చేసి కొలెస్ట్రాల్ కరిగేటట్లు చేస్తుంది.

5-Mana-Aarogyam-784ప్రతిరోజూ ఒక గ్లాసెడు బూడిద గుమ్మడికాయ రసం తీసుకున్నట్లయితే మన శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయి. ప్రత్యేకించి పిల్లలు బూడిద గుమ్మడి రసం తప్పకుండా తాగాలి. ఈ జ్యూస్ తీసుకోవడం మొదలు పెట్టిన కొన్ని వారాలకే పిల్లలు చురుకుగా మారడం గమనించవచ్చు. పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగితే అది శక్తిని ఇవ్వడంతోపాటు కొద్దిగా ఆందోళనలు కూడా కలిగిస్తుంది.

అదే బూడిదగుమ్మడి రసం తాగితే గొప్ప శక్తిని ఇవ్వడంతోపాటు మిమ్మల్ని స్థిమిత పరుస్తుంది. వీలైనంత తరచుగా దీనిని తీసుకోవడం మంచిది. కానీ ఆస్తమా ఉన్నవారు తరచుగా జలుబు దగ్గుతో బాధపడేవారు బూడిదగుమ్మడి రసం తాగినప్పుడు వెంటనే జలుబు చేసే అవకాశం ఉంది ఎందుకంటే అది మన శరీరంలో చలువ చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య ఉన్నవారు బూడిదగుమ్మడి రసానికి కొంత తేనె గాని మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి.

అలా చేయడం వల్ల బూడిద గుమ్మడి రసం వల్ల కలిగే చలువ కొంత వరకు తగ్గిస్తుంది. ఈ గుమ్మడి కాయ జ్యూస్ లో ట్రిప్టోఫాన్ అను పిలవబడే ఎమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఒత్తిడి ఆందోళన తో పోరాడి డిప్రెషన్ను తగ్గిస్తుంది. కనుక డిప్రెషన్ మానసిక సమస్యలతో బాధపడుతుంటే ప్రతి రోజు ఈ జ్యూస్ ను తప్పకుండా తీసుకోండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR