ఎర్రమట్టిలో ఉండే,వివిధ రకాల ఖనిజాలు వాటి ఉపయోగాలు

మనిషిని మట్టిని వేరు చేయలేము. మన ఆరోగ్య విషయంలోనూ మట్టి పాత్ర చాలా కీలకం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చాలావి మట్టిలోనుంచి వచ్చినవే. మలినాల వల్ల సమస్త చర్మరోగాలకూ శరీరం నిలయమవుతుంది. వీటి నివారణ కోసం వచ్చినవే ప్రకృతి సిద్ధమైన మట్టి చికిత్సలు. అయితే చాలా మంది మట్టి, బురదను చూస్తే అసహ్యించుకుంటారు. కాళ్లకు కొంచెం మట్టి అంటుకోగానే నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుంటారు.

కానీ మట్టి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరే అవాక్కవుతారు. సాధార‌ణంగా కొంద‌రు చ‌ర్మ ఛాయ‌ను పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఫేస్ ప్యాకులు, సీర‌మ్‌లు ఇలా ఎన్నో యూజ్ చేస్తారు. త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్తూ ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు. అయితే న్యాచుర‌ల్‌గా ఎర్ర మ‌ట్టితో చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవ‌చ్చు.

ఎర్రమట్టిలో ఉండే,వివిధ రకాల ఖనిజాలు విటిలిగో చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనిని పూసుకున్నప్పుడు, మెలనిన్ ఉత్పత్తి పెరిగి, తెల్ల మచ్చలను స్పష్టంగా కనిపించకుండా చేస్తుంది. ఎర్రమట్టిలో ఉండే,వివిధ రకాల ఖనిజ ఆక్సైడ్లు, చర్మాన్ని శుద్ధి చేసి, మాలినాలు మరియు విష పదార్థాలను తొలగించి శుభ్రపరుస్తాయి.

5-Mana-Aarogyam-779దీనిలో ఉండే ఐరన్ ఆక్సైడ్, బలహీనమైన బంధనాలకు బలం చేకూరుస్తుంది. ఇది చర్మాన్ని పునరుత్తేజ పరచి, మేనిఛాయను తేలికపరుస్తుంది. ఎర్రమట్టి చర్మ కణాలను పునరుత్తేజితం చేస్తుంది కనుక, తెల్లని మచ్చల చికిత్సకు ఉపయోగపడుతుంది. ఎర్రమట్టిలోని యాస్ట్రిజెంట్ తత్వాలు మొటిమలను పరిష్కరించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఖనిజాలు మెండుగా ఉండటం వలన, ఎర్రమట్టిని ఉపయోగిస్తే చర్మం నునుపుగా మరియు మృదువుగా మారుతుంది. ముల్తానీ మ‌ట్టి మాదిరిగానే ఎర్ర మ‌ట్టి కూడా మార్కెట్‌లో ల‌భిస్తుంది. మ‌రి ఈ ఎర్ర మ‌ట్టిని చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర మ‌ట్టి, చిటికెడు ప‌సుపు, రెండు తేనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌న‌వ్వాలి.అ నంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.మూడు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే క్ర‌మంగా చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.

2-Mana-Aarogyam-779అలాగే ఒక గిన్నెలో రెండు స్పూన్ల ఎర్ర మ‌ట్టి తీసుకుని అందులో గ్రీన్ టీ వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మంతో ఫేస్ ప్యాక్ వేసుకుని. పావు గంట పాటు వ‌దిలేయాలి. తరువాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు ముడ‌త‌లు, మ‌చ్చ‌లు కూడా దూరం అవుతాయి.

అల్లం రసాన్ని ఒక గిన్నెలో పిండి, దానికి ఒక టేబుల్ స్పూన్ ఎర్ర మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాస్తూ కొద్ది నిమిషాలు పాటు మృదువుగా మర్దన చేసుకోండి. తరువాత మాస్కును పది నిమిషాలు పాటు ఆరనివ్వండి. బాగా ఆరాక, చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తరువాత చర్మాన్ని పొడిగా తుడుచుకుని, మాయిశ్చరైజర్ రాసుకోండి.

3-Mana-Aarogyam-779ఎర్ర మట్టి మరియు అల్లం రసం కలిపి చర్మం పై వాడినపుడు, రక్తప్రసరణ మెరుగై,చర్మానికి లోపల నుండి పోషణ లభించి, సహజంగా మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ మాస్కును క్రమం తప్పకుండా వినియోగిస్తే,తెల్లమచ్చలు నెమ్మదిగా తగ్గిపోతాయి.

ఇక ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఎర్ర మ‌ట్టి, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌవ‌డ‌ర్ మ‌రియు స‌రిప‌డా నీరు పోసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని.ప‌దిహేను నిమిషాల అనంత‌రం ఫేస్ వాష్ చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది1-Mana-Aarogyam-779

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR