Home Health గంధం పేస్ ప్యాక్ వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

గంధం పేస్ ప్యాక్ వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

0

పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని ఉపయోగించేవారు. కానీ మొట్ట మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన సౌందర్య సాధనం గంధం చెక్క, సాన రాయి. ఈ రెండిటిని ఉపయోగించి ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవడం ఎన్నో ఏళ్ళ క్రితమే అందుబాటులోకి వచ్చింది.

benefits of Sandalwood Pace Packప్రస్తుతం ఉన్న తరానికి దీని గురించి తెలియక పోవచ్చు.దీని తయారి విధానం కూడా పెద్ద కష్టమేమి కాదు. ముందుగా గంధం చెక్క, సాన రాయి, మంచి నీళ్ళు, ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. ఆ తరువాత సాన రాయిపై రెండు చుక్కల నీళ్ళు వేసి గంధం చెక్కని అరిగించాలి.

ఇలా అరగ దీసిన మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి సుమారు గంట వరకూ ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం ఎంతో మృదువుగా, మెరుపులా తయారవుతుంది. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు చేస్తే ఫలితాన్ని మీరే గుర్తిస్తారు.

మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ తో ఇబ్బందులు పడే కంటే ఇలా ఇంట్లోనే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ తో మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

 

Exit mobile version