ఆవిరి పట్టడం వల్ల ముఖానికి కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

జలుబు చేసినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆవిరి పట్టడం. జలుబు వలన ఊపిరాడని పరిస్థితి ఉంటే ఆవిరి పట్టండం తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే కేవలం జులుబు చేసినపుడు మాత్రమే రిలీఫ్ కోసం ఆవిరి పట్టడం అనేది కాదు. ఆవిరి పట్టడం వల్ల ముఖానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.

benefits of steam for the face?ఆవిరి పట్టడం వల్ల ముఖ సౌందర్యం మెరుగు పడుతుంది.మనం రోజూ ముఖానికి రాసుకునే క్రీములు, లోషన్లు, వాటిలో ఉండే రసాయనాలు వలన చర్మానికి అందాల్సిన పోషకాలు అందకపోడం మాత్రమే కాక ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.దీని వల్ల చర్మం కాంతి కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.

benefits of steam for the faceదానివలన చర్మం పొడిబారిపోవడం, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా అనేక స‌మస్యలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఫలితంగా, ఈ సమస్యల పరిష్కారం కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ని ప్రయత్నించి భంగపడతాము. అయితే అలా నిర్జీవంగా ఉన్న ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖం పై మూసుకుపోయిన రంధ్రాలు తెరచుకొని మురికి బయటకు వచ్చేస్తుంది. దీంతో ముఖం శుభ్రం అయ్యి కాంతివంతం గా కనిపిస్తుంది.

benefits of steam for the faceఈ విధంగా నెలకి రెండు సార్లు చేస్తే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కంటి కింద నల్లటి వలయాలు తో బాధ పడుతున్నారు. తరచూ ముఖానికి ఆవిరి పట్టడం వల్ల నెమ్మదిగా నల్లటి వలయాలు తగ్గు ముఖం పడతాయి. ముఖానికి ఆవిరి పట్టే నీటిలో తులసి ఆకులతోపాటు చిటికెడు పసుపు కలిపి ఆవిరి పడితే మొటిమలు మటుమాయమవడమే కాకుండా చర్మానికి సహజసిద్ధమైన పోషకాలు లభించిముఖం కాంతివంతమవుతుంది.

benefits of steam for the faceఅలాగే రెండు గ్లాసుల నీటిని వేడి చేసి అందులో టీ బ్యాగులను ఉంచి ఆవిరి పట్టుకుంటే.. ముఖం తాజాగా మెరిసిపోతుంది. ఇదే సమయంలో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే, ముఖానికి తేమ తగలడమే కాకుండా, సూక్ష్మ రంధ్రాలు తెరచుకుంటాయి. అదే విధంగా, రెండు గ్లాసుల నీటిలో గులాబీ రేకులు వేసి మ‌రిగించాలి. అనంత‌రం ఆ వాట‌ర్‌తో ముఖానికి ఆవిరి ప‌ట్టిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR