ఈత పండ్లతో కరోనాని ఎదుర్కోవచ్చు అంటున్న నిపుణులు!

సీజన్లను అనుసరించి ప్రకృతి మనకు ఎన్నో పండ్లను ఇస్తూంటుంది. వాటిని తింటేనే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్నం తో పాటు ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర తృణధన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. వేసవి రాగానే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి కాయలు, సపోటా ఇలా అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. అలా ప్రకృతి ప్రసాధించిన పండ్లలో ఈతపండ్లు ఒకటి.

ఈత పండ్లయెల్లో బెర్రీస్‌గా పిలిచే ఈత పళ్ళు మన భారతదేశంలోనే కాకుండా ఎడారి ప్రాంతంలో కూడా పండుతాయి. ఈతకాయలైతే కాస్త వగరుగా, బాగా పండిన పైండ్లెతే తియ్యగా ఉంటాయి. కాయలుగా ఉన్నప్పుడు వాగారుతో తినలేకపోయినా బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ప్రకృతిలో పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఈత పండ్లపల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈతపళ్ళను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాలిష్యం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈతపండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.

ఈత పండ్లఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్ గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్దకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.

ఈత పండ్లఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి. కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినటం వలన వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ,అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగనిరోధాల శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి.

ఈత పండ్లఈతపండులో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈత పండ్లలో విటమిన్ A , విటమిన్ b1, విటమిన్ b2, విటమిన్ b3, విటమిన్ b6, విటమిన్ b9, విటమిన్ c వంటి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈత పండ్లు ఎముకలను దృడంగా చేయడమే కాదు దంతాలు గట్టిగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు ఈ పండ్లు తింటే… కరోనా ను ఎదురుకునే విధంగా రోగనిరోధశక్తి పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఈత పండ్లఅలాగే ఈత పండ్ల గుజ్జుతో వైన్ కూడా తయారు చేస్తారు.ఈత చెట్టు కాండానికి పైభాగంలో గాటుపెట్టి దాని నుంచి కారే ద్రవాన్ని పులియబెట్టి కల్లుగా తయారు చేసి తాగుతారు.ఈ ద్రవాన్ని పులియ పెట్టకుండా నేరుగా మరిగించి దానితో ఈత బెల్లం తయారు చేస్తారు. చెరుకు బెల్లం కంటే ఈత బెల్లంలో చక్కెర స్థాయి కాస్త తక్కువగా ఉంటుంది. పోషకాల కోసం ఖర్జూరం పై ఆధారపడలేని వాళ్లకు ఈత పండ్లు చౌకైన ప్రత్యామ్నాయం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR