చెర్రీస్ తో జ్యూస్ చేసుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలట!

ఎర్రగా ఉండే చెర్రీస్ చూడగానే నోరు ఊరుతుంది. కానీ చెర్రీ పండ్లు రేటు ఎక్కువని వాటి జోలికి వెళ్లరు. ఇక చెర్రీ జ్యూస్… చాలా మంది ఇది తాగేందుకు ఇష్టపడరు. కానీ ఈ జ్యూస్ తాగితే… ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండూ మీ సొంతం అవుతాయి. అందుకే సంపన్న వర్గాల ప్రజలు ఇటీవల చెర్రీ పండ్ల జ్యూస్ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒక గ్లాస్ చెర్రీ పండ్ల జ్యూస్ తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

red cherry juiceఆధునిక కాలంలో ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మంది నిద్ర‌లేమికి గుర‌వుతున్నారు. ఈ స‌మ‌స్య ఉన్న వారు త‌ర‌చూ అల‌స‌ట‌, నీరసం వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కొంటారు. అయితే రెగ్యుల‌ర్‌గా లేదా రెండు రోజుల‌కు ఒక సారి చెర్రీ పండ్ల‌తో త‌యారు చేసిన జ్యూస్‌ను ఒక గ్లాస్ చొ‌ప్పున తీసుకుంటే నిద్ర‌లేమి స‌మ‌స్య దూరం అవుతుంది. అదే స‌మ‌యంలో నీరసం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌నే చేర‌వు.

blue cherriesవర్కవుట్ తర్వాత చాలా మంది నీరసించిపోతారు. వాళ్లకు వెంటనే బలం కావాలి. కండరాల్లో ఎనర్జీ నిండాలి. అందుకోసం వాళ్లు చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే సరి. చెర్రీ పండ్లు ఎక్కువ సేపు ఎనర్జీని నిలిపివుంచుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇలా ఎక్కువ సేపు, ఎక్కువగా శ్రమించే ఎక్సర్‌సైజ్‌లు చెయ్యాలంటే… ఎక్కువ సేపు ఎనర్జీని ఇచ్చే చెర్రీ జ్యూస్ తాగమంటున్నారు డాక్టర్లు.

gymఅలాగే చెర్రీ పండ్ల జ్యూస్ త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుస్తాయి. దాంతో ఇన్‌ఫెక్ష‌న్లు, వైర‌స్ల బారిన ప‌డ‌కుండా మ‌న శ‌రీరానికి ర‌క్ష‌ణ క‌వ‌చం ల‌భిస్తుంది. ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉండే ఈ చెర్రీ పండ్ల జ్యూస్‌ తీసుకుంటే‌ బ‌రువు కూడా త‌గ్గొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

eye problemsచెర్రీ జ్యూస్ తాగితే… బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాదు… బ్రెయిన్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. కంటి చూపు మెరుగవుతుందని పరిశోధనల్లో తేలింది. ఇటీవ‌ల కాలంలో ఎంద‌రో లైంగిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు త‌ర‌చూ ఈ జ్యూస్ తీసుకుంటే స్త్రీపురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. సంతాన స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

lose weightచెర్రీలలో చాలా రకాలున్నాయి. డార్క్ రెడ్, పర్పుల్, బ్లూ ఫ్రూట్స్ ఉంటాయి. దాదాపు అన్నింటిలోనూ నేచురల్ షుగర్స్ ఉంటాయి. అలాగే… కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ ఉంటాయి. ఫ్యాట్ మాత్రం ఉండదు. చెర్రీ పండ్లలో ఉండే ఆంథోసియానిన్స్… స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. కాన్సర్, డయాబెటిస్ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉన్నప్పుడు చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే మేలు జరుగుతుంది.

memory powerఇక కొంద‌రు ముప్పై ఏళ్ల‌కే వృద్దాప్యఛాయ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే చెర్రీ పండ్ల జ్యూస్ తీసుకుంటే అందులో ఉండే ప‌లు పోష‌కాలు చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడు య‌వ్వ‌నంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.మొటిమలు, ముడ‌త‌లు వంటివి ద‌రి చేర‌వు. కొంతమంది ప్రతీదీ మర్చిపోతుంటారు. ఒకటి చెయ్యబోయి మరొకటి చేస్తుంటారు. ఎక్కువగా ముసలివారిలో ఈ లక్షణాలు (డైమన్షియా వ్యాధి లక్షణాలు) కనిపిస్తుంటాయి. అలాంటి వారు చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 12 వారాలపాటూ… రోజూ చెర్రీ జ్యూస్ తాగితే… షార్ట్ టెర్మ్ మెమరీ పవర్ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR