సపోటాతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే తినకుండా ఉండలేరు!

ఎటువంటి రోగాలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే సహజంగా లభించే ఖనిజ లవణాలను, పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు అంటే పండ్లు, ఆకు కూరలు, కాయలు వీటిని ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రస్తుతం కలుషిత ఆహారం ఎక్కువ అవ్వడంతో సహజ సిద్ధమైన పండ్లను తినడం అలవాటుగా చేసుకోవడం చాలా మంచిది.

benefits to the nutrients found in sapotaఅయితే కొన్ని పండ్లను కొంత మంది మాత్రమే తినాలి.. ముఖ్యంగా బాలింతలు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. బాలింతలు ముఖ్యంగా తీసుకోవాల్సిన పండ్లలో సపొటాలు ఒకటి. సపోటాల్లో కెరోటిన్లు, నియాసిన్‌, పిండి పదార్థాలు, రైబోఫ్లేవిన్లు, శక్తి , క్యాల్షియం, థయామిన్‌, ఫ్రక్టోస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవేకాదు సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

benefits to the nutrients found in sapotaసపోటాలో పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ అందిస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-A కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి. సపోటాలోని ఫైబర్లు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

benefits to the nutrients found in sapotaసపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టిగా ఉంటాయి. రోజూ సపోటా జ్యూస్‌ తాగేవారికి జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉండవట. ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా మంచిదేనట. నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించడంలోనూ సపోటా ఉత్తమంగా పనిచేస్తుందట. నిద్రలేమి, అందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే మంచిదట. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోట మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR