This Heartfelt Take On Best Characters Of Sam Is A Proof That She Is The ‘Sampoorna Nati’

సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఎవరో ఒక అమ్మాయి తెర మీద కనిపించింది తనని చూడగానే ఏదో ఆకాశం నుంచి ఊడిపడిన ఏంజెల్ లా అనిపించింది అని నేను అబద్దం అయితే చెప్పలేను నాకు ఏమి ఆలా అనిపించలేదు కానీ తనని ఆ రోజు సినితెర పై చూస్తున్నంతసేపు తన రాకని ముందే ఊహించిన శిల్పి ఎవరో ఆ తెరని తన కోసమే తీర్చిదిద్దినట్టు అనిపించింది, ఆ సినిమా ముగిసింది థియేటర్ నుంచి బైటకి వచ్చేసాను సినిమా బాగుందో లేదో అనే ఆలోచనలు ఏమి నా మెదడులోకి రావట్లేదు అప్పుడు నా మెదడు మనసు రెండు జత కలిసి ‘జెస్సీ’ అని ఏదో పిచ్చి రాగాలు కూస్తున్నాయి. ఎందుకు ఇంత పిచ్చి అని నన్ను నేను పరీక్షించుకోడానికి మళ్ళీ మళ్ళీ ‘జెస్సీ’ కోసం ఆ సినిమాకి వెళ్ళాను. వెళ్లిన ప్రతిసారి కదులుతున్న జెస్సీ రూపం వినపడుతున్న తనది కానీ తన స్వరంతో మనసంతా ఒక మోయలేని బరువుతో నిండిపోయేది మోయలేను ఏమో అని అనిపించేది కానీ ఆ బరువుని కిందకి దించాలి అనిపించేది కాదు విషయం ఏమిటి అంటే ఆ బరువుని ఇప్పటికి దించలేదు ఇంకా కొన్ని పాత్రలు జతచేరి ఇంకా బరువు అయ్యింది. 10 ఏళ్ళ క్రితం ఏ మాయా చేసావే లో జెస్సీగా కన్ఫయూజ్ చేసింది తనే ఈ మధ్య జాను గా మళ్ళీ మనలన్నీ ఒక స్థితిలోకి తెచ్చింది తనే…రంగస్థలంలో దైర్యం నిండిన ‘రామలక్ష్మి’ తనే…అమాయకత్వం, ఆలోచన నిండిన మధురవాణి తనే…భర్త కోసం అన్ని భరించే శ్రావణి తనే…అల్లరి చేసి కన్నీరు పెట్టించే స్వాతి తనే…భర్తకి తెలీకుండా ప్రియుడితో సమయం గడిపిన వెంబు తనే…ఇది తను అది తను అని ఒక్క మాటలో తనని మనం ఎంత ఇరికించాలి అనుకున్న బంధించలేము. తను ఎవరికి ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల హృదయాలన్ని తన పరిణితి చెందిన నటనతో గెలుస్తూనేపోతుంది ఇంకా రాబోయే దశాబ్దంలో కూడా గెలుస్తూనేపోతుంటుంది కచ్చితంగా. కొంతమందికి తను అందం మరికొంతమందికి తను సమంత అక్కినేని, ఇంకొంతమందికి సమంత రూత్ ప్రభు మరి నాకు మాత్రం తను ఒక పరిణితి కలిగిన నటి చూసే ప్రేక్షకుడిని ప్రభావం చెయ్యగల నటి.

Samanthaరాబోయే కాలంలో ఎన్నో పాత్రలతో మనలన్నీ మంత్రం ముగ్దులన్నీ చెయ్యడం మాత్రం ఖాయం. సమంత అంటే ఎందుకు అంత ఇష్టం ఒక మూడు కారణాలు చెప్పు అని అంటారా? అయితే ఇదిగో ఇదే నా సమాధానం.

1 ) నటన 2 ) నటన 3 ) నటన

“ఎవరు ఎవరు నీవంటే నీవు ధరించిన పాత్రలు అంతే”

1) ఏ మాయా చేసావే – జెస్సీ

Samanthaసమంతని మొదటిసారి చూసింది ఈ సినిమాలోనే ఇప్పటికి ఈ సినిమా ఒక మాయనే. జెస్సీ ఒక జీవితకాలపు జ్ఞాపకం. సింపుల్గా చెప్పాలి అంటే జెస్సీ మనగుండెల్లో గుడి కట్టుకున్న ఒక “కుందనపు బొమ్మ”

2) అనసూయ రామలింగం – అఆ

Samanthaకొంచెం అమాయకత్వం, ఇంకొంచెం కన్నింగ్న్స్, భరించలేని అంత వెటకారం ఎంతైనా భరించాలి అనుకునే తన ప్రేమ ఇదే కదా మా అనసూయ రామలింగం అంటే.

3) మధురవాణి – మహానటి

Samanthaసావిత్రమ్మని మేము నిజంగా చూడలేదు కానీ మధురవాణి రూపంలో సావిత్రమ్మ దగ్గర మనమే ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేసింది సమంత. సావిత్రమ్మ జీవితం చూస్తూ మధురవాణి దైర్యం తెచ్చుకుంది మాకు దైర్యం ఇచ్చింది.

4) రంగస్థలం – రామలక్ష్మి

Samanthaనీ యాసా, నీ రూపు, నీ మాట, నీ తెలివి, నీ దైర్యం ఎంత సక్కగున్నావే ఓహ్ లచ్చిమి…

5) స్వాతి – ఓహ్ బేబీ

Samanthaపొట్ట పగిలేలా నవ్వించావ్ వెంటనే గుండె పగిలేలా కన్నీరు పెట్టించావ్… Love You Oh Baby

6) వెంబు – సూపర్ డీలక్స్

Samanthaఏది తప్పు ఏది ఒప్పు…ఛీ ఏంటి ఈ క్యారెక్టర్ అనుకునే లోపలే పాపం అనిపించేలా బాధ కలిగించవు ఏదో క్షణంలో చేసిన తప్పుకి జీవిత కాలపు శిక్ష వెయ్యడం తప్పు అని నిరూపించావు. అసలికి ఏది తప్పు అని ప్రశ్నించావు?

7) శ్రావణి – మజిలీ

Samanthaఆ రోజుల్లో సతి సావిత్రి ఈ రోజుల్లో మన శ్రావణి…

8) జాను – జాను

Samanthaదేనితోనైనా పోటీ పడచ్చు కానీ కాలంతో పోటీ పడి గెలవలేము ఆలా అని ఆ కాలాన్ని అక్కడ వొదిలి వెళ్లలేము కానీ జీవితంలో ముందుకు పోవాలి అని మళ్ళీ జానూ గా మా మనసులని గెలుచుకున్నావ్.

Thank You Samantha For Choosing Cinema As Your First Love

Many more years and many more fantastic characters yet to come.

All the best, Sam…

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR