శివుడు హిమాలయాలకు వెళ్లడం వెనుక పురాణం ఏంటి?

హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు హిమాలయాల్లో నివసిస్తుంటారు. హిమాలయాలు ఆసియాలోని భారతదేశం, నేపాల్, పాకిస్థాన్, చైనా మరియు భూటాన్ దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇక ఈ మంచు కొండల్లో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి శివుడు హిమగిరి చేరుటలో మర్మం ఏంటి? కైలాస పర్వత శిఖరం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

shivudi nivasthalamశివపార్వతుల నివాస స్థలం కైలాస శిఖరం. హిమాలయాల్లో ఉన్న ముఖ్యమైన పర్వత శిఖరాల్లో కైలాస శిఖరం ఒకటి. హిందువులు, జైనులు, బౌద్దులు ఈ పర్వతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తాయి. ఇప్పటివరకు ఎవరు కూడా అధిరోహించలేని శిఖరం కైలాస పర్వతం. ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు కైలాస గిరి, మానస సరోవరం. పూర్వం రావణుడు తన తల్లి కోరిక తీర్చడం కోసం ఈ ప్రాంతంలోనే శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుడిని మెప్పించి ఇక్కడే ఆత్మలింగాన్ని పొందాడని స్థల పురాణం.

shivudi nivasthalamఇక పురాణాల ప్రకారం,  దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం లో అవమాన భారానికి గురై సతీదేవి ఆత్మహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు కోపానికి గురై వీరభద్రుడు సృష్టించి దక్ష ప్రజాపతి తలని నరికి సంహరిస్తాడు. ఆ తరువాత, శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని తన భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తుండగా, శివుడిని శాంతిప చేయడానికి విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. దాంతో ఆమె దేహం 18 ఖండాలై భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. కాలక్రమంలో అవే అష్టాదశ శక్తి పీఠాలు గా అవతరించాయి. ఇక ఆ తరువాత శివుడు దక్షుడిని పునర్జన్మని ప్రసాదిస్తాడు.

shivudi nivasthalamఆ తరువాత శివుడు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటాడు. అయితే దేవతలందరు కూడా సతీదేవి మళ్ళీ జన్మిస్తేనే శివుడు తిరిగి ప్రపంచంలోకి వస్తాడని భావించిన దేవతలు సతీదేవిని మళ్ళీ జన్మించాలంటూ ప్రార్ధించారు. అప్పుడు హిమాలయాల రాజు హిమవంతుడికి, మేనకా దంపతులకి పార్వతీదేవి జన్మించింది. ఇక తల్లితండ్రుల ద్వారా తానూ జన్మించింది శివుడిని వివాహం చేసుకోవడానికే అని తెలుసుకొని శివుడి కోసమై రోజు తపస్సు చేసుకుంటూ ఉండేది. పార్వతీదేవి తపస్సుని తెలుసుకున్న శివుడు ఆ దేవిని అనుగ్రహించగా, వీరి వివాహానికి వచ్చిన శ్రీమహావిష్ణువు పెళ్లి పనులన్నీ చూసుకుంటే, బ్రహ్మ దేవుడు వివాహంలో పండితుడిగా వ్యవహరించాడని పురాణం.

shivudi nivasthalamఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం, సొన్ ప్రయాగకు పడమరగా సుమారు 5 కి.మీ. దూరంలో త్రియుగీ నారాయణ్ అనే ఆలయం ఉంది. ఈ ఆలయం బయట గోడలు లేకుండా నాలుగు మూలాల రాతిస్థంబాలు, రాతి పైకప్పు మాత్రం ఉండి, మందిరం మధ్యలో ఒక నేలమీద నుండి నాలుగు అంగుళాల ఎత్తులో, సుమారు 3 అడుగుల ఉన్న రాతిపలక పానవట్టం లాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. అయితే శివపార్వతులు వివాహం ఈ పీఠం పైన జరిగిందని స్థల పురాణం చెబుతుంది.

shivudi nivasthalamహిమాలయాల్లోని మానస సరోవరం ఒడ్డున కైలాస పర్వతం ఉంది. టిబెట్ భూభాగంలో సముద్రమట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది. కైలాస పర్వతం సింహం, గుర్రం, ఏనుగు, నెమలి ఆకారంలో ఒక్కో వైపు ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా నాలుగు వైపులా నాలుగు రంగుల్లో బంగారు, తెలుపు, కాషాయం, నీలం రంగుల్లో కనిపిస్తుంటుంది. కైలాస పర్వతం మధ్యలో ఉండగా ఈ పర్వతం చూట్టు ఒక ఆరు పర్వతాలు ఉంటాయి. యాత్ర చేసే భక్తులు ఈ పర్వతాల చూట్టు మాత్రమే ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇప్పటివరకు ఎవరు కూడా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళలేదు. ఇక కైలాస పర్వతం చూట్టు ప్రదక్షిణ అనేది చేయాలంటే సరైన వాతావరణం ఉంటె మూడు నుండి నాలుగు రోజుల సమయం పడుతుంది. పౌర్ణమి రోజుల్లో కైలాస పర్వతం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.  దేవతలు ఇక్కడి సరోవరంలో స్నానం చేయడానికి ప్రతి రోజు రాత్రి స్వర్గలోకం నుండి ఇక్కడి వస్తారని ప్రతీతి. అంతేకాకుండా ఉదయం 3 నుండి 5 గంటల సమయంలో బ్రహ్మి ముహూర్తంలో  శివుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,610,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR