మెదడును డ్యామేజ్ చేసే ఈ అలవాట్లు నుండి జాగ్రత్త

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. మిగతా అవయవాలుఎంత ఆరోగ్యం గా ఉన్నా ఇది పనిచేయకపోతే ఇబ్బందే. అలాంటి మెదడు ఆరోగ్యం గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో..

Beware of these habits that can damage the brainఅది డ్యామేజ్ కాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం. అయితే, ముఖ్యం గామెదడును డ్యామేజ్ చేసే అలవాట్లు మనిషిలో చాలా ఉన్నాయి. అవేంటంటే…

బ్రేక్ ఫాస్ట్ మానేయడం:

Beware of these habits that can damage the brainఉదయం టిఫిన్ తినడం మానొద్దు. అలా చేస్తే రక్తంలో సుగర్ లెవల్స్ తగ్గి మెదడు మొద్దుబారిపోతుంది. శరీరంలో అన్ని భాగాల కంటే ఎక్కువ ఎనర్జీని తీసుకునేది మెదడే. కాబట్టి, సమయానికి ఆహారం తింటూ ఎప్పటికప్పుడు ఎనర్జీని అందించాలి.

అవసరమైన నిద్ర లేకపోవడం:

Beware of these habits that can damage the brainఈ రోజుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. మెదడు సక్రమంగా పనిచేయాలంటే కంటి నిండా నిద్రపోవాలి. లేకపోతే మానసిక సమస్యలు ఏర్పడి మీ రోజువారి పనులకు విఘాతం ఏర్పడుతుంది. నిద్రలేమి వల్ల మెదడుకు ఏర్పడే నష్టం ఓ ప్రమాదంలో తలకి తగిలే బలమైన గాయంతో సమానం.

అతిగా తినడం:

Beware of these habits that can damage the brainఅవసరానికి మించి ఆహారం లాగించినా మెదడుకు చేటే. ఊబకాయానికి జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి(Dementia)కి దగ్గర సంబంధం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి అతిగా తిని అనార్థాలు తెచ్చుకోవద్దు.

యూరిన్‌ను ఆపుకోవ‌డం:

Beware of these habits that can damage the brainయూరిన్ కు వెళ్లడాన్ని కొంతమంది వాయిదా వేస్తుంటారు.అలా చేయడం వల్ల మెదడు నరాలు ప్రభావితం అవుతాయనితాజా అధ్యయనాల్లో తేలింది. అందుకే మూత్ర విసర్జనచేయాలనిపించిన వెంటనే వెళ్లడం మంచిది. ఇవేకాకుండా ఎక్కువగా మాట్లాడటం, ఆలోచనా శక్తి తగ్గడం,వ్యాయామాలు చేయకపోవడం, ఆరోగ్యం సరిగా లేనప్పుడుబ్రెయిన్ పై ఒత్తిడి పెంచడం, పొల్యూషన్ కూడా మెదడుడ్యామేజ్ కు కారణమవుతాయి.

స్మోకింగ్:

Beware of these habits that can damage the brainస్మోకింగ్ ఎన్నివిధాలుగా చూసినా నష్టమే. పొగతాగడం వల్ల మెదడులో ఉండే కణాల పొరలు, నాళాలు దెబ్బతింటాయి. అతిగా స్మోకింగ్ చేసేవారు గజినీలుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. మానవుని మెదడు పై భాగాన పొరగా కప్పి ఉంచే పదార్థం (కార్టెక్స్) పలచబడుతుంది. అసలు స్మోకింగ్ చేయని వ్యక్తులతో పోల్చితే 25 ఏళ్లపాటు స్మోకింగ్ చేసిన వ్యక్తుల కార్టెక్స్ చాలా పలచబడినట్లు ఓ సర్వేలో తేలింది.

నీరు తాగకపోవటం:

Beware of these habits that can damage the brainమన శరీరంలో ఉండేధీ 70 శాతం నీరే. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే తప్పకుండా నీరు తాగాలి. ముఖ్యంగా మెదడుకు అవసరమైన ఆక్సిజన్ కూడా నీటి ద్వారానే చేరుతుంది. రెండు గంటలపాటు నీరు తాగకుండా వ్యాయమం చేసినట్లయితే తీవ్ర నిర్జలీకరణకు గురవుతారని, దీనివల్ల శరీరం అదుపు తప్పుతుందని సర్వేలు తెలుపుతున్నాయి. నీరు తాగకపోతే మెదడులో సమన్వయ లోపం తలెత్తుతుంది. ‘దాహం’ అనేది మెదడు అందించే సిగ్నల్. ఈ నేపథ్యంలో దాహం వేసిన ప్రతిసారి నీరు తాగడం మరిచిపోవద్దు.

సుగర్’ తగ్గించండి:

Beware of these habits that can damage the brainశరీరానికి, మెదడుకు సుగర్ అవసరమే. కానీ, అతిగా తీసుకోకూడదు. అతిగా సుగర్ తీసుకుంటే మెదడులోని కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే మీ శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను ఆహారం నుంచి గ్రహించడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

ఒత్తిడి:

Beware of these habits that can damage the brainదీర్ఘకాలిక ఒత్తిడి మనిషిని జీవశ్చవం చేస్తుంది. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల మెదడులో కార్టిసోల్ (ఒత్తిడిని ఎదుర్కొనే హార్మోన్) తీవ్రమై శాస్వత సమస్యగా మారుతుంది. అంతేకాదు, మెదడులోని కణాలను ఛిద్రం చేయడమే కాకుండా, మెదడు కుచించిపోడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉంటె వెంటనే అప్రమత్తమై ఈ రోజు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే. మెదడు బిందాస్‌గా పనిచేస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR