Home Unknown facts Bhakthula Hrudayalalo Nilichipoina Sai Baba

Bhakthula Hrudayalalo Nilichipoina Sai Baba

0

భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలలో సాయిబాబా కొలువై ఉన్న షిర్డీ ఒకటిగా చెబుతారు. సాయిబాబాకి పుట్టినిల్లు షిర్డీ. అయితే షిర్డీ కాకుండా సాయిబాబా కొలువై ఉన్న ఆలయంలో దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక దక్షిణాన సాయిబాబా కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ షిర్డీ గా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని బాబాని దర్శిస్తే షిరిడీ సాయిబాబాని దర్శించినంత అనుభూతిని పొందుతున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.Sai babaతెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ జాతీయ రహదారి ప్రక్కన శ్రీ షిరిడీ సాయిబాబా వారి దేవాలయం కలదు. ఈ ఆలయం పూర్తిగా షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని పోలి ఉంటుంది. అందువలన ఈ ఆలయాన్ని దక్షిణ షిరిడీ గా భక్తులు పిలుస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ వెలసిన ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. పూర్వం ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం నేడు ఆధునిక ఆలయ సముదాలతో విరాజిల్లుతుంది. భక్తులు ఈ ఆలయంలోని బాబాను దర్శిస్తే షిరిడీలోని బాబాను దర్శించినంత అనుభూతిని పొందుతున్నారు. భక్తుల కోర్కెలు ఈ బాబా నెరవేరుస్తునట్లు భక్తులలో ఒక భావన ఏర్పడింది. అందుకే ప్రతినిత్యం బాబాని దర్శించటానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. పాలక మండలి నేతృత్వంలో ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని 1989 లో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు ప్రతిష్టించారు. ఇక 1991 లో మొదటి అంతస్థు నిర్మాణం చేసి పైన ధ్యాన మందిరం ఏర్పాటు చేసారు. ఆ తరువాత 1994 లో ఆలయానికి రెండవ అంతస్థు నిర్మాణం చేసారు. ఈవిధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత సుందరమైనదిగా రూపుదిద్దుకుంది. దక్షిణ షిరిడిగా పేరుగాంచిన ఈ ఆలయంలోని సాయిబాబా కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల హృదయాలలో నిలిచిపోయాడు.

Exit mobile version