Home Unknown facts Bharathadeesham goppathananni thelipe konni ascharyakara vishayalu

Bharathadeesham goppathananni thelipe konni ascharyakara vishayalu

0

భారతదేశం ఏ ఒక్క మతానికి చెందినది కాదు. అన్ని మతాల వారిని హక్కును చేర్చుకునే ఒక గొప్ప మనసు మన దేశానికే ఉంది. ప్రపంచంలో లేని ఎన్నో వింతలు విశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, సైన్స్, పర్యాటక రంగం ఇలా ఏ విషయంలో అయినా మన దేశానికి మంచి గుర్తింపు అనేది ఉంది. అయితే ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకర నిజాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ ఆశ్చర్యకర విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.1 India Goppatanamడైమండ్:మొట్టమొదటిసారిగా డైమండ్ ని మన దేశంలోనే గుర్తించారు. అదికూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, క్రిష్ణా జిల్లాల మధ్య ఉన్న క్రిష్ణా నదిలో డైమండ్ అనేది మొదటిసారిగా కనుగొనబడింది.
చెస్: చెస్ అనే గేమ్ మొదటగా మన దేశంలోనే పుట్టింది. మెదడుకి పని చెప్పే ఈ చెస్ ని చతురంగ అని అంటారు. ఈ పదం సంస్కృతం నుండి వచ్చింది. చతురంగ అంటే నలుగురిని అర్ధం. ఆ నాలుగు ఏంటంటే యుద్ధంలో ఉండే ఏనుగు, సిపాయి, రథం, గుర్రం అని అర్ధం. ప్రస్తుతం చెస్ ఆంతర్జాతీయ గుర్తింపు పొందింది.
హిందూ క్యాలెండర్:హిందూ క్యాలెండర్ లో ఆరు రుతువులు, భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఆరుకాలాలున్నాయి. అవి గ్రీష్మ, హేమంత, శిశిర రుతువు, శరత్ రుతువు, వసంత రుతువు, వర్ష రుతువు.
ఆర్మీ:మూడవ అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశంగా మన దేశాన్ని చెబుతారు. మొదటి రెండు స్థానాలలో అమెరికా, చైనా ఉన్నాయి.
అస్థిపంజరం:ఇండియా మరియు చైనా సరిహద్దులలో ఉన్న ఒక చెరువు ఎండిపోవడం మూలాన అందులో అస్థిపంజరాలు లభించాయి. ఇవి దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం వి అని పరిశోధనలో తేలింది.
కుంభమేళా:మన దేశంలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళా. అయితే 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగిది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసేది కుంభమేళా సమయంలోనే అని తేల్చారు. భారతదేశంలో తప్ప మరెక్కడా కూడా ఇంతమంది మనుషులు ఒకేసారి కలవరు. అయితే ఈ పండుగ సమయంలో బిలియన్ సంఖ్యలో మనుషులు పాల్గొంటారు.
పాల ఉత్పత్తి: మన దేశం వ్యవసాయ రంగానికి ప్రత్యేకం. అదేవిధంగా పాల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉందని చెబుతారు.
పోస్టల్ సర్వీస్:భారతదేశంలో అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. చిన్న చిన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద సిటీలు, టౌన్లకు కూడా పోస్టల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాశ్మీర్ లో కూడా పోస్టాఫీస్ ప్రారంభించారు.
పోలో క్లబ్:ప్రపంచం మొత్తంలో అతిపురాతన పోలో క్లబ్ మన దేశంలోని కోలకతా లో ఉంది.
శాకాహారం: ప్రపంచం లోని అన్ని దేశాలతో పోలిస్తే మన దేశం మాంసాహారానికి ఎక్కువగా దూరంగా ఉంటున్నారు. దాదాపుగా మన దేశంలో 30 శాతం వరకు శాకాహారులు ఉంటారు.
ఇంగ్లీష్:అగ్రరాజ్యం అయినా అమెరికా తరువాత ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేది మన దేశమే అని తేలింది.

Exit mobile version