పార్వతీదేవి కామాక్షిదేవిగా అవతరించిన మహిమగల ఆలయం

0
7759

ఈ ఆలయంలో శివుడు మల్లికార్జునుడిగా, పార్వతి దేవి కామాక్షిదేవిగా పూజలందుకొనుచున్నది. ఇక్కడ కొలువై ఉన్న కామాక్షి అమ్మవారిని శక్తిపీఠంగా కొలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ప్రదేశానికి జొన్నవాడ అనే పేరు ఏవిధంగా వచ్చింది? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

jonnawadaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు 12 కీ.మీ. దూరంలో, పెన్నానది తీరాన జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షి దేవస్థానం ఉంది. 1150 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అనేక బాధలు నివారించగలిగిన శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడి అమ్మవారు పేరు గాంచింది. ఈ ఆలయమునందే తిక్కన యజ్ఞం చేసి తిక్కన సోమయాజి అయ్యాడు అని చెబుతారు. జగద్గురు శ్రీ శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.

jonnawadaఇక పురాణానికి వస్తే, త్రేతాయుగంలో కశ్యపమహర్షి ఇక్కడ ఒక గొప్ప యజ్ఞం చేసాడు. ఆ యజ్ఞ్గుగుండంలో నుంచి పరమశివుడు ఆవిర్భవించి, మహర్షి కోరిక మేరకు ఇక్కడే వుండి పోయాడు. అప్పుడు భర్తను వెదుక్కుంటూ వచ్చిన పార్వతీ దేవి శివుని అభీష్టం ప్రకారం కామాక్షీదేవి పేరుతో ఇక్కడే వుండి పోయింది.

jonnawadaఅయితే పూర్వం ఈ జొన్నవాడను రత్నగిరి అని పిలిచేవారు. కశ్వమహర్షి జన్నం అనే ఒక యజ్ఞం చేసాక ఇది జన్నవాడ అని పిలువబడింది. జన్నవాడాయే క్రమంగా మరి నేడు జొన్నవాడగా పిలువబడుతుంది. ఈ ఆలయంలో మల్లికార్జునస్వామి వారు ఉన్ననూ కామాక్షిదేవియే ఎక్కువ ప్రాతినిధ్యం వహించి ఉంది.

jonnawadaఇచ్చటగల కామాక్షిదేవి ముగ్గురమ్మలమూలపుటమ్మయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు ఈ అమ్మవారిని దర్శించి అయన మంత్రపూత జలంతో ఆమెను అభిషేకించాడని అప్పటినుండి ఈ మహిమాన్వితురాలు మరింత మహిమ కనబరుస్తూ, భక్తుల అరదలందుకొనుచున్నది అని తెలియుచున్నది. ఈ తల్లిని ఆరాదించేందుకు సాధారణ భక్తులే కాకా, గ్రహ పీడితులు, పిశాచ పీడితులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు, సంతానం లేనివాళ్లు, మానసిక రోగులు ఎందరో వచ్చి అమ్మవారిని దర్శించి తమ బాధలను నుంచి విముక్తి పొంది, సత్ఫాలితాలు పొందరాని చెబుతుంటారు.

jonnawadaప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు.

6 jonnawadalo velasina bramaramba mallikarjuna kamakshi devalayam