Bike ni devudila aaradisthunna bullet baba devalayam thelusa?

మన దేశంలో ఎన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. మనం గుడికి వెళితే దేవుడి దర్శనం చేసుకొని మొక్కు బడులు తీర్చుకుంటాం. కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రం బైక్ ని దేవుడిలా కొలుస్తూ దానికే పూజలు చేస్తున్నారు అక్కడి స్థానిక భక్తులు. మరి బుల్లె బాబా ఆలయం ఎక్కడ ఉంది? వారు బైక్ ని దేవుడిలా ఎందుకు పూజిస్తున్నారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. bikeరాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో బులెట్ బాబా ఆలయం ఉంది. ఈ దేవాలయంలో ఎలాంటి దేవుడూ ఉండడు. ఈ గుడిలో దేవుడికి బదులు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఉంటుంది. ఇంకా బుల్లెట్ బాబా కి నైవేద్యంగా లిక్కర్ ని పెట్టడం విశేషం. ఈ బుల్లెట్ బాబాని పూజించడం వలన రోడ్ అసిడెంట్స్ లేదా ఇతర ప్రమాదాల నుండి ఆ బాబా వారిని కాపాడుతాడని స్థానిక భక్తుల నమ్మకం.bikeఇక బుల్లెట్ బాబా ఆలయం వెనుక ఒక కథ వెలుగులో ఉంది, ఓం సింగ్‌ రాథోడ్‌ అనే యువకుడు 350 సీసీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై ఇంటికి వెళ్తూ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. ఓం సింగ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు బుల్లెట్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు బుల్లెట్‌ ప్రమాద స్థలంలో ప్రత్యక్షమయింది. బుల్లెట్‌ను ఎవరు తీసుకెళ్లారో తెలియలేదు. మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి పెట్రోల్‌ ఖాలీ చేశారు, టైర్లలో గాలిని తీసి, గొలుసలతో కట్టి ఉంచారు. అయినా, అది మళ్లీ ప్రమాద స్థలంలో ప్రత్యక్షమయింది. ఇలా ఎన్ని సార్లు చేసినా బల్లెట్‌ ప్రమాద స్థలంలో ప్రత్యక్షమయ్యేది. దీంతో, పోలీసులు బుల్లెట్‌ను అక్కడే పెట్టేశారు. కొన్ని రోజులకు స్థానిక ప్రజలు బుల్లెట్‌కు గుడి కట్టారు. ఇలా బుల్లెట్‌ దేవాలయం వెలిసింది. bikeఇక జాతీయ రహదారిపై వెళ్లే వాళ్లు బుల్లెట్‌ గుడిని దర్శించి ప్రమాదాలు జరగకుండా చూడమని వేడుకుంటారు. ఇలా ఈ ఆలయం కొన్ని రోజులకి చాలా గుర్తింపు పొందడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. bike

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR