కరోనా వచ్చిన రోగుల్లో మరో కొత్త సమస్య అదేంటో తెలుసా ?

మానవాళికి కరోనా మహమ్మారి చేసిన నష్టం ఒక్క మాటలో చెప్పలేనిది. ఈ వైరస్ బారిన పెడితే ప్రాణాలు దక్కించుకోవడమే కష్టం అనుకుంటే ఆ తరువాత ఎదురయ్యే పరిస్థితులు అంతకన్నా భయానకంగా ఉన్నాయి. కరోనాతో పోరాడిన వారిలో చాలా కాలం పాటు దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయన్న విషయం తెలిసిందే. కొవిడ్‌ వచ్చినప్పుడే కాదు.. తగ్గిపోయి నెలలు గడుస్తున్నా ఇబ్బందులు వెంటాడుతునే ఉన్నాయి.

Bone Death Problems In Corona Patientsఈ విషయంతోనే చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే… తాజాగా మరో షాకింగ్ విషయం బయటపడింది. కరోనా వచ్చిన వారిలో బోన్ డెత్ అనే కొత్త సమస్య ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. బోన్ డెత్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎముకలు పనికి రాకుండా కుళ్లిపోవడం అని అంటారు. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో ఎముకల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు.

Bone Death Problems In Corona Patientsచాలా మంది కూర్చుంటే లేవలేకపోతున్నారని.. లేస్తే నాలుగు అడుగులు వేయలేక పోతున్నారని.. కాలు కదిపితే నొప్పి, చేయి ఆడిస్తే ఇబ్బంది, తుంటిలో నొప్పితో బాధపడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మందిలో ఇలా బోన్ డెత్ సమస్యలు బయటపడ్డాయి. ఇటీవలికాలంలో ఎముకల డాక్టర్ల వద్దకు వస్తున్న పోస్ట్‌ కొవిడ్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ వచ్చి తగ్గిన మూడు నెలల నుంచి ఆరు నెలల సమయంలో చాలా మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Bone Death Problems In Corona Patientsఅసలు ఈ సమస్య కరోనా వచ్చిన వారిలో ఎందుకు ఉత్పన్నమవుతోందని పరిశీలించగా… కరోనాను తగ్గించేందుకు చేసే చికిత్స వల్లే ఈ సమస్య వస్తోందని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. నీరసం, బలహీనత కారణంగా చాలామంది కుర్చీలు, మంచాలకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు ఆఫీసులలో/వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లో.. గంటల తరబడి కూర్చున్న చోటనే ఉండిపొతున్నారు.

Bone Death Problems In Corona Patientsఇలా కదలికలు తగ్గిపోవడం వల్ల, ఎండ సోకక డి-విటమిన్‌ తగ్గిపోవడం వల్ల కూడా వారి కండరాలు, ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. ఇక కొవిడ్‌ సమయంలో మందులు అధిక మోతాదులో వినియోగించడం వల్ల ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతోందని.. ఎముకల సమస్యలకు కారణం ఇదేనని వైద్యులు అంటున్నారు.

Bone Death Problems In Corona Patientsముందే కీళ్లలో సరిగా రక్తప్రసరణ ఉండదంటే… ఈ స్టెరాయిడ్స్ వాడి చికిత్స చేయడం వల్ల తుంటిలో ఉన్న కణాలు చనిపోతూ ఉంటాయి. దీనినే బోన్ డెత్ అని పిలుస్తారు. చాలా మంది ఈ వ్యాధి రావడానికి కారణం కరోనా చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ అనే చెబుతున్నారు. ఎక్కువ రోజులు వెంటిలేటర్ పై ఉండడం కూడా ఈ వ్యాధి రావడానికి ఒక కారణమని తెలుపుతున్నారు.

Bone Death Problems In Corona Patientsసాధారణంగా రోగుల్లో ఈ బోన్ డెత్ సమస్య స్టెరాయిడ్స్ వాడిన రెండేళ్ల తర్వాత వస్తే కరోనా రోగుల్లో ఈ సమస్య కేవలం అరవై రోజుల్లోనే వస్తుందనే షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. అయితే డి-విటమిన్‌ తీసుకోవడం వల్ల కొవిడ్‌ నుంచి, పోస్టు కొవిడ్‌ ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. అవసరం మేరకు డి-విటమిన్‌ లభిస్తే ఎముకలకు బలం పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు కూడా బలంగా ఉంటాయి. రోజు ఉదయం ఎండలో కాసేపు గడిపితే ఎముకలకు కావాల్సిన విటమిన్లు అందుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR