Home Health మజ్జిగ చలువకు మాత్రమే కాదు…!

మజ్జిగ చలువకు మాత్రమే కాదు…!

0

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి అత్యుత్తమ ఉపాయం మజ్జిగ. వేసవిలో డీహైడ్రేషన్ లేదా రక్తహీనతను భర్తీ చేయడానికి మజ్జిగను మించినది లేదు. శీతల పానీయాలు లేదా ఇతర శీతల పానీయాలను తాగడం కంటే మజ్జిగ, పన్నా, చెరకు రసం చాలా ఉత్తమమైన ప్రత్యామ్నాయాలు. మజ్జిగ తాగడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది.

buttermilkమజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.

మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు. మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు. మజ్జిగలో బయో యాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. రెగ్యులర్ గా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

మజ్జిగ తాగడం వల్ల కడుపులో మంట త్వరగా తగ్గుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. అజీర్ణం, గ్యాస్ ప్రాబ్లమ్స్ లను తగ్గిస్తుంది.గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవారు ప్రతి రెండు గంటలకొకసారి ఒక గుక్కెడు మజ్జిగ తీసుకుంటే చాల మంచిది. దీనివలన శరీరంలోని యాసిడ్ లు కరిగి గొంతుద్వారా వచ్చే మంట తగ్గుతుంది.

పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు. దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది. రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి.

ఎసిడిటీ నీ తగ్గించడానికి మజ్జిగని మించిన మందు లేదు. కొద్దిగా అల్లం నూరి వేసి చేసిన మజ్జిగ కడుపులో ఉండే బర్నింగ్ సెన్సేషన్ ని తగ్గిస్తుంది. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్టమక్ లైనింగ్ ఒకెసారి ఇరిటేట్ అవ్వచ్చు. మజ్జిగ ఆ ఇరిటేషన్ ని కంట్రోల్ చేస్తుంది. సరైన టైం లో తినకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వంటివి కాన్‌స్టిపేషన్ కి దారి తీస్తాయి. ఫైబర్ తక్కువ ఉన్నా కూడా ఈ సమస్య వస్తుంది. రోజూ ఒక పెద్ద గ్లాస్ బటర్ మిల్క్ తాగుతూ ఉంటే ఈ సమస్యనించి ఈజీగా బయట పడవచ్చు.

నోటి పుండుకి మజ్జిగ మంచి మందు. రోజుకి రెండు మూడు పెద్ద గ్లాసుల మజ్జిగ తాగితే ఈ సమస్య ఈజీగా తగ్గిపోతుంది. ఉప్పు లేకుండా చేసిన పల్చటి మజ్జిగని నోటి లోపల అటూ ఇటూ తిప్పి మింగేస్తే మౌత్ అల్సర్స్ త్వరగా తగ్గుతాయి. అయితే గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి. మేక మజ్జిగ తేలికగా ఉంటుంది.

Exit mobile version