బిడ్డ కడుపులో ఉన్నప్పుడే రుచి తెలుసుకోవడం, వినడం చేస్తాడా?

అమ్మతనం అనేది ఆడజన్మకు సార్థకత. అమ్మ అనిపించుకోవడం కోసం పెళ్ళైన ప్రతీ స్త్రీ తపన పడుతుంది. తల్లి కాబోతున్నామని తెలిస్తే ఎంతో ఆనందిస్తుంది. స్త్రీకి గ‌ర్భం దాల్చ‌డం అన్నింటికంటే ఎక్కువ‌గా ఆనందాన్నిచ్చే విష‌యం. గర్భం దాల్చిన నాటి నుండి పండంటి బిడ్డ భూమి మీద‌కు వ‌చ్చేదాకా ఆత్రంగా ఎదురుచూస్తుంటాం. లోప‌ల బిడ్డ పెరుగుతున్న కొద్దీ త‌ల్లులు దాని గురించి మ‌రింత ఆలోచిస్తుంటారు. క‌డుపులో స‌రైన పోష‌ణ అందుతుందో లేదో అని అనుకుంటూ ఉంటారు. ఈ కార‌ణంగానే క‌డుపుతో ఉన్న‌వారు త‌ర‌చూ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకొని బిడ్డ క‌ద‌లిక‌ల‌ను చూడాల‌నుకుంటారు.

pregnant women vomitingsగర్భంతో ఉన్న సమయంలో శరీరంలో కలిగే కొన్ని మార్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పొట్ట పెరిగే కొద్దీ నొప్పులు తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. ఫలితంగా సరిగా నిద్ర పట్టదు. ఇక వికారం, మార్నింగ్ సిక్నెస్, వాంతులు, అజీర్తి, తలనొప్పి, వంటి నొప్పులు, మరేదైనా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వంటి సమస్యలు ఎన్ని ఎదురైనా, కడుపులో బిడ్డ ఉందన్న ఆనందం ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. అలాగే ఆరోగ్యమైన శిశువు కొరకు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే.. తల్లి తీసుకునే ఆహారపుటలవాట్లు మొత్తం జీవన శైలి ప్రభావం బిడ్డపై ఉంటుంది.

women with babyఅంతేకాదు కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి చేసే ప్రతీ పని బిడ్డపై ప్రభావం చూపిస్తుందట. అందుకే గర్భం తో ఉన్నప్పుడు తల్లి మంచి మాటలు వినాలి.. ప్రశాంతం గా ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. వినికిడి, శబ్దాలను గ్రహించడం, రుచిని తెలుసుకోవడం..ఈ మూడు విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ తెలుసుకుంటాడట. చాలావరకు పిల్లలు తీసుకునే ఆహారం వాళ్ల అమ్మ కడుపుతో ఉన్నప్పడు తీసుకునే ఆహారాన్ని ఇష్టంగా తినడం. వాళ్ల అమ్మ కడుపుతో ఇష్టపడని ఆహారాన్ని పిల్లలు కూడా ఇష్టపడకపోవడం జరుగుతుంటుంది. అలాగే నవజాత శిశువులు తల్లి కడుపులో ఉన్నప్పుడే మాటలను గుర్తించడం నేర్చుకుంటారట.

fetusతల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయి, అర్ధమవుతాయి అన్న విషయాన్ని పురాణ కథనాలు అనేకం మనకు చెబుతున్నాయి. ఇవి అతిశయోక్తి కాదు, ఇందులో నిజం ఉంది అని ఉదాహరణ తో సహా తెలియజేశాయి మన ధార్మిక గ్రంధాలు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి అవగాహన చేసుకున్నాడని భారతంలో చెప్పబడింది. అలాగే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుని మాటలు విని అర్ధం చేసుకున్నారు అని, అందువల్లనే పుట్టుకతోనే విష్ణు భక్తుడు అయ్యాడు అని తెలియజేస్తుంటారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కన్నా, ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాదునికి ఎక్కువ ఉపయోగపడతాయి.

abhimanyuduనేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువు గా ఉన్నప్పుడు ప్రారంభమవుతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి రుజువు చేశారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి వస్తుంది అని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగలుగుతారు అని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు .

pregnant women vomitingsఅందుకే గర్భిణీ స్త్రీలు వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, చెడ్డమాటలు ,అరుపులకు దూరంగా ఉండమని సూచిస్తారు. మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని తెలియ చేస్తున్నారు. అంత మంచి వ్యక్తులుగా కూడా ఎదుగుతారు. దైవ భక్తి ఉంటే ఇష్టమైన దైవం శ్లోకాలు ,పాటలు ,ప్రవచనాలు వింటూ ఉంటే మంచిది. లేదంటే మంచి పాజిటివ్ విషయాలు, మంచి కథలు వింటూ ఉంటే మంచిది. అలా పాజిటివ్ గా ఎదిగిన బిడ్డ పుట్టి పెరిగి మంచి వ్యక్తి అవుతాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR