ఒంట్లోని కొవ్వు రంగుని బట్టి జబ్బులను గుర్తించవచ్చా?

మనం తినే ఆహరం ద్వారా వచ్చే శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కొవ్వు ఏరంగులో ఉందనేది ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. కొవ్వు రంగును బట్టి గుండె జబ్బులు వచ్చే ముప్పును ముందే పసిగట్టే సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

కొవ్వుమన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్వలు ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను ఎక్కువ తినటం వల్ల కూడా శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు.

కొవ్వుతెలుపు, గోధుమ రంగు కొవ్వు కణాలు ఉష్ణోగ్రతలను బట్టి రూపాల్ని మార్పిడి కూడా చేసుకుంటాయి. అంటే మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట.

కొవ్వుక్యాప్సైసిన్‌ సప్లిమెంట్‌ను తీసుకుంటే శరీరంలో తెల్ల కొవ్వు కణాలు గోధుమ రంగు కొవ్వు కణాలుగా మారిపోయి, ఫలితంగా మెటబాలిక్‌ రేట్‌ పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారని తేలింది. క్యాప్సైసిన్ ఎక్కువగా మిరపకాయల్లో ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ త్వరగా ఎందుకు తగ్గదంటే, ఇక్కడ తెల్ల కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉంటాయి.

కొవ్వుబ్రౌన్ ఫ్యాట్ విషయానికి వస్తే మెడ చుట్టూ, భుజాలు, చేతుల చుట్టూ ఈ కొవ్వు ఉంటుంది కనుక వీటిని సన్నబరచటం చాలా సులువు. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించేది బ్రౌన్ ఫ్యాట్. చలి నుంచి మనల్ని రక్షించేలా చేసే బ్రౌన్ ఫ్యాట్ ను కరిగించటం చాలా ఈజీ. కానీ మన శరీరంలో కేవలం 10శాతం మాత్రమే బ్రౌన్ ఫ్యాట్ నిల్వలు ఉంటాయి. ఎక్కువ శాతం ఉన్న వైట్ ఫ్యాట్ ను బ్రౌన్ ఫ్యాట్ గా మార్చితే సన్నబడటం చాలా ఈజీగా జరుగుతుంది.

కొవ్వువైట్ ఫ్యాట్ తక్కువ ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు తక్కువ. హైపర్ టెన్షన్ తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉండేలా చేసే వైట్ ఫ్యాట్ నిల్వలను మీ శరీరంలో కరిగించేలా ప్రయత్నించండి.

కొవ్వుఒకవేళ ఎవరైనా ఊబకాయంతో బాధపడుతున్నప్పటికీ వారి ఒంట్లో వైట్ ఫ్యాట్ బదులు బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే వారికి ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. వైట్ ఫ్యాట్ తో హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే కొందరిలో మాత్రమే జన్యుపరంగా ఎందుకు ఎక్కువ బ్రౌన్ ఫ్యాట్ ఉంటుందన్నది ఇంకా అతుచిక్కని చిక్కుగా మిగిలిపోయింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR