వర్షాకాలం పెరుగు తినడం ఎంత ప్రమాదమో తెలుసా?

మిగతా సీజన్ లతో పోలిస్తే వర్షాకాలం తిండి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వానాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. అందులో ఒకటి పెరుగు. సాధారణంగా ఎవరైనా అన్నం ఎంత తిన్నప్పటికీ పెరుగుతో ఒక్క ముద్దైనా తినాలనుకుంటారు. పెరుగు లేకపోతే ముద్ద దిగనివారు కూడా బోలెడు మంది ఉంటారు. నిజమే మరి పెరుగు తినడం వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులో చల్లదనం కోసం పెరుగు తింటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపులో మంటను కూడా పెరుగు తగ్గించేస్తుంది. అందులో ఉండే ఎంజైమ్ మలబద్దకం నుంచి కూడా బయటపడేస్తుంది.

4-Mana-Aarogyam-793అంతే కాకుండా నిద్రలేమితో బాధపడే వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.పెరుగు తినడం వల్ల మంచిగా నిద్ర పట్టడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తుంటారు. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి అది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ హై బీపీ సమస్యలను అదుపు చేస్తుంది. పెరుగు చర్మానికి జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే పెరుగుని ప్రతీ ఒక్కరి తప్పనసరిగా తమ ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవాలంటుంటారు.

5-Mana-Aarogyam-793ఎండాకాలంలో పెరుగును అందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా చేయడం మంచిదే. ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఫలితంగా బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి డీ హైడ్రేట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే పెరుగు ఎక్కువగా తీసుకుంటే మంచి జరుగుతుంది. బాడీకి చలువ చేకూరుతుంది. కాబట్టి పెరుగును క్రమం తప్పకుండా ఎండాకాలంలో తీసుకుంటే మంచిదే. కానీ వానాకాలంలో పెరుగు తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందకంటే.. దీని వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1-Mana-Aarogyam-793పెరుగు ఒక్కటే కాదు పెరుగుతో తయారయ్యే ఏ ఇతర పదర్ధాలను కూడా తినడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి లాంటివి కూడా తీసుకోవడం మంచిది కాదు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియకు మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యాక్టీరియా ఎక్కువ కావడం ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. గొంతులో ఏదో పట్టేసినట్లు ఉంటుందని.. దీంతో ఏం తినాలన్నా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే పెరుగు సాధారణ మనుషులు తీసుకుంటే ఏం కాదు. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తీసుకుంటే వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుందట. ఈ సీజన్ లో అలా తీసుకోవడం వల్ల అంతక ముందు కీళ్ల నొప్పులు లాంటివి ఉంటే.. అవి మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంటుందట. శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది పడేవారు, ఆస్తమా పేషెంట్స్ కూడా పెరుగు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అసిడిటీతో బాధపడేవారు పెరుగు అస్సలు తీసుకోవద్దని చెప్తున్నారు.

3-Mana-Aarogyam-793అలర్జీ, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్‌పెక్షన్లు, మైగ్రేన్‌ తలనొప్పి, సైనసైటిస్‌.. వంటివి ఉన్న వాళ్లు ఈ సీజన్‌లో పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుంది. అలాంటి చల్లటి పదార్థాల జోలికే వెళ్లకూడదు.పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. ఒక్కోసారి పెరుగు తినడం వల్ల చలువ పెరిగి జలుబుచేస్తే తలనొప్పిగా మారి వేధిస్తుంది. అందుకే ఆయుర్వేదం ప్రకారం.. భాద్రపద మాసంలో పెరుగు తినడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు.

6-Mana-Aarogyam-793సాధారణంగా పిల్లలు పెరుగును క్రమం తప్పకుంటా తీసుకుంటూ ఉండటం మనం గమనించొచ్చు. అలా వారు పెరుగు తీసుకోవడం ఒక టైమ్ వరకే మంచిదని పెద్దలు చెప్తుంటారు. కొంత కాలం తర్వాత బాడీలో కొవ్వు పెరిగి నంజు ఏర్పడే అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఒక వేళ అంతగా పెరుగు తినాలనుకుంటే మధ్యాహ్న సమయాల్లో తినాలి తప్ప ఉదయం, రాత్రి సమయాల్లో అస్సలు తినకూడదని సూచిస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR