భోజనం ముందు కానీ చేసిన వెంటనే కానీ నీరు త్రాగవచ్చా ?

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టీనేజ్ వయసులోనే బరువు పెరిగి, కొవ్వును తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతున్న వారిని ఎంతోమందిని ప్రతి నిత్యం చూస్తున్నాం. అలాంటి వారు బరువు తగ్గడానికి ఎన్నో విధానాలను అనుసరిస్తుంటారు. అయితే లండన్‌కు చెందిన ఓ సర్వే బరువు తగ్గడానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

భోజనం ముందు నీరు త్రాగవచ్చాచాలా మంది అన్నం తింటున్నప్పుడూ ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. అయితే కొంతమంది తినెప్పుడు నీళ్లు తాగకూడదు అని చెబుతుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరమని కూడా చెబుతుంటారు. మరికొంతమంది అన్నం తినడానికి గంట ముందు నీళ్లు తాగమంటారు. మరికొంతమంది వద్దంటారు. అన్నం తినే సమయంలో నీళ్లు తాగకూడదని కొందరు చెబుతారు. అలా తాగడం మంచిదే అంటారు మరికొందరు. అన్నం పూర్తిగా తినేసిన తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదంటారు. ఇలా అన్నం-నీళ్లకు సంబంధించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో వైద్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్న వాదనలకు అస్సలు పొంతన ఉండదు.

భోజనం ముందు నీరు త్రాగవచ్చాభోజనానికి ముందు నీరు తాగడం వలన శరీరం బలహీనంగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా త్రాగడం వలన స్థూలకాయానికి దారితీస్తుందని అంటున్నారు. ఈ సమస్య అనేది మన జీవన వచ్చే ఆహార అలవాట్లు వలన జరుగుతుందట. అయితే చాలా మందికి తినేటప్పుడు నీళ్లు తాగడం అలవాటు. ఖాళీగా ఉన్న సమయంలో తాగకుండా కేవలం అన్నం తినే సందర్బంలో మాత్రమే నీటిని ఎక్కువగా తాగేవారు చాలా మందే ఉన్నారు. అయితే భోజన సమయాల్లో ఎంత నీరు తాగుతారు అనేది మీ ఆరోగ్యాన్ని నిర్దేశించడంలో సహాయపడుతుంది.

భోజనం ముందు నీరు త్రాగవచ్చాఅన్నం తినడానికి గంట ముందు నీళ్లు తాగమని వైద్యనిపుణులు చెబుతారు. ఇలా చేయడం వల్ల పొట్ట సాఫీగా మారి, జీర్ణక్రియకు సిద్ధమౌతుందని అంటారు. అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం దీన్ని ఒప్పుకోరు. ఇలా చేయడం వల్ల వ్యక్తులు బలహీనమౌతారని వాళ్లు వాదిస్తున్నారు. భోజన సమయంలో ఎక్కువగా నీళ్లు తాగడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు తాగే విషయంలో మనం అనుసరించాల్సిన మార్గాలు కొన్ని ఉన్నాయి. భోజనం చేసే సమయంలో సిప్ చేస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా నీరు తాగాలని నిపుణులు తెలిపారు. ఇలా తీసుకున్న నీరు మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియకు వీలుగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా జరగడానికి ఈ పద్ధతి మంచిదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి.. జీవక్రియ రేటు సక్రమంగా ఉండలంటే వెచ్చని నీటిని భోజనం చేసేటప్పుడు తాగాలి.

భోజనం ముందు నీరు త్రాగవచ్చాకానీ అన్నం తింటున్నప్పుడు నీళ్లు తాగకూడదని ఇంగ్లిష్ వైద్యులు చెబుతారు. ఇలా అన్నం మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందనేది వాళ్ల వాదన. ఆయుర్వేద వైద్యులు మాత్రం అన్నం తింటున్నప్పుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు తాగితే తప్పులేదంటారు. అయితే అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగాలా వద్దా అనే విషయంలో అటు ఆయుర్వేద వైద్యులు, ఇటు ఇంగ్లిష్ వైద్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసారు. అన్నం తిన్న కాసేపటి వరకు నీళ్లు తాగొద్దని ఇటు ఆరోగ్య నిపుణులు, అటు ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే బరువు పెరుగుతారనే విషయాన్ని ఇద్దరూ అంగీకరిస్తున్నారు.

భోజనం ముందు నీరు త్రాగవచ్చాఅన్నం తినేముందైనా, అన్నం తింటున్న క్రమంలోనైనా మితంగా అంటే 200 మిల్లీ లీటర్లకు మించకుండా నీళ్లు తీసుకోవచ్చు. అయితే ఈ నీళ్లు కూడా గోరువెచ్చగా ఉంటే మంచిదనేది అందరూ ఆమోదించిన సమాధానం. అలాగే అన్నం తినే ముందు నీళ్లు తాగడం వలన బరువు తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నీళ్లు తాగితే బరువు ఎలా తగ్గుతారనే సందేహం రావొచ్చు. కానీ దానికో కారణముంది. భోజనానికి ముందే నీరు తాగడంతో కడుపు నిండిన అనుభూతి పొందుతారని, ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు మూడు నెలల్లోనే 4 కిలోల బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో తేలింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR