హోమ్ రెమిడీస్ తో మీ ముఖం కాంతివంతంగా మార్చుకోవచ్చు ?

ఇది వరకటి రోజుల్లో అమ్మాయిలు పార్టీలు, ఫంక్షన్‌లకు మాత్రమే మేకప్ వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు డైలీ మేకప్ చేసుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. వాతావరణం, తీసుకునే ఆహరం ఇలా కారణం ఏదైనా చర్మం సహజత్వాన్ని కోల్పోయి బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే మేకప్ వేసుకోవాలన్న కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Face Be Brightened With Home Remediesపొడిచర్మం ఉన్న వారికి మేకప్‌తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు మేకప్ వేసిన తర్వాత అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. దీనికి పరిష్కారం ఉంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇంట్లోని పదార్థాలు ఉపయోగించి మీ ముఖం కాంతివంతంగా మార్చుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జిడ్డు చర్మం గలవారు మినపప్పులో, పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ఫేషియల్‌లా వేసుకుంటే జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు మిశ్రమాన్ని తీసుకొని అందులో కాస్త పెరుగు, నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

మినపప్పు, పసుపు ఇవి రెండు పదార్దాలు కూడా శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని చేకూర్చేవి. రెండు స్పూన్ల మినపప్పు పొడిలో చిటికెడు పసుపు, వేసి నీరు పోసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Face Be Brightened With Home Remedies2 స్పూన్ల మినపప్పు పొడిలో 4 స్పూన్ల పాలు, 2 స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్ర చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడుసార్లు చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందమైన, ఆకర్షణమైన చర్మం మీ సొంతం అవుతుంది.

Face Be Brightened With Home Remediesజిడ్డు చర్మం కలవారు పాలతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవటం వల్ల అక్కడి మురికి అంటా తొలగి పోవటమే గాక ముఖం తాజాగా మారుతుంది.

Face Be Brightened With Home Remediesముఖం,మెడ మీద తేనెను రాసి మర్దనా చేసి పావుగంట ఆరిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మానికుండే సహజ సిద్ధమైన నిగారింపును నిలుపుకోవచ్చు.

Face Be Brightened With Home Remediesఒక స్పూన్ ముల్తానిమట్టికి నాలుగు స్పూన్స్ రోజ్‌ వాటర్‌ని కలిపి ముఖం, మెడ మీద రాసుకొని బాగా ఆరనిచ్చి చల్లని నీటితో కడిగితే చర్మంలోని జిడ్డు తొలగిపోయి సహజ సిద్దంగా మారుతుంది.

Face Be Brightened With Home Remediesజిడ్డు చర్మానికి కొంచెం కర్పూరం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ చర్మం పై మృదువుగా రాసుకొని ఐదు నిమిషాలు తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను సంతరించుకుంటుంది. అలాగే, రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది.

Face Be Brightened With Home Remediesజిడ్డు చర్మం ఉన్నవారు గంధం పొడిని నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేయటం వల్ల చర్మం తాజాగా మారటంతో బాటు కళ్ళ కింది నల్లని వలయాలు కూడా తొలగిపోతాయి. ముక్కు, ముఖ భాగాలలో పేరుకు పోయిన నల్లని యాక్సిన్ కూడా తొలగిపోతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR