Home Health నీళ్లు సరిపడినంత తాగలేకపోతున్నారా ఇది ఒక గ్లాస్ తాగితే చాలట!

నీళ్లు సరిపడినంత తాగలేకపోతున్నారా ఇది ఒక గ్లాస్ తాగితే చాలట!

0
Lemon water
  • ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొంచెం నిమ్మ రసం కలుపుకుని తాగితే చాలా రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వల్ల చాలా రకాల ఇన్‌ఫెక్షన్లు తేలిగ్గా తగ్గిపోతాయి.
  • నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి చర్మం ముడతలు, వృద్ధాప్యం నుంచి కాపాడటమే కాకుండా పొడి చర్మం, ఎండ నుంచి చర్మానికి కలిగే డ్యామేజీని తగ్గిస్తుంది. సాధారణంగా నీళ్ళు ఎక్కువగా తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుందని మనకు తెలుసు కానీ ఎక్కువ మొత్తంలో నీటిని తాగలేకపోతుంటాం. అలాంటి వారు కనీసం ఓ గ్లాసు డు నిమ్మరసాన్నైనా తాగండి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
  • ముఖ్యంగా వేసవి లో నిమ్మరసాన్ని డైట్‌లోచేర్చుకోవడం చాల అవసరమని తెలియచేస్తున్నారు. చాలామంది పనులలో పడి శరీరానికి  తగినంత నీటిని అందించరు. దీంతో శరీరంలో  నీటిశాతం బాగా తగ్గిపోయి ,డీహెడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు చుట్టుముడతాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మ రసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా  చాలావరకు అదుపు చేయవచ్చు. పైగా నిమ్మ రసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా  కాపాడుతుంది.
  • అలాగే నిమ్మరసంలోఉండే ఫైటోన్యూట్రియంట్లు, యాంటీఆక్సిడెంట్లుగాకూడా  ప్రభావాన్ని చూపుతాయి. ఇవి అధిక మొత్తంలో రిలీజ్ అయ్యే కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి రక్షణ కల్పిస్తుంది. వేడి నీటితో నిమ్మ రసం తీసుకోవడం వలన శరీరంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ స్థాయి కూడా మెరుగవుతుంది. ఫలితంగా కిడ్నీలో ఏర్పడిన రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి.
  • కిడ్నీలో ఉన్న రాళ్లనే  కాదు గాల్ బ్లాడర్‌లో రాళ్లను కూడా నిమ్మరసం చాల  సమర్ధవంతంగా తరిమికొడుతుంది. ఫలితంగా కడుపునొప్పి సమస్యతగ్గుతుంది . ఇందు కోసం రోజూ వేడి నీటిలో  నిమ్మరసం కలుపుకునితాగడం మంచిది. రోజూ నిమ్మరసం తాగడం వలన  జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు ఉండవు.ముఖ్యం  గా గ్యాస్‌, ఏసీడీటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి సమస్యలు చాలా తేలికగా మాయమవుతాయి. పరగడుపున వేడి నిమ్మ రసం త్రాగడం వలన గ్యాస్ట్రో  సిస్టం మెరుగవుతుంది. దీని వలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది.
  • ఇలా నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిసిన మనకు దీంతో ప్రమాదం ఉందని తెలియదు. రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే. ప్రధానంగా నిమ్మరసం మోతాదుకి మించి తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఇది తాగుతున్నప్పుడు ఏమనిపించదు. కొన్నిరోజుల తర్వాత ప్రభావం చూపుతుంది. సమస్యను గుర్తించి నిమ్మరసం అధికంగా తాగడాన్ని ఆపేయాలి. లేదని కంటిన్యూ చేస్తే ఆ సమస్యలూ తీవ్రమై వెంటాడుతాయి.
  • చాలామంది నిమ్మరసాన్ని డైరెక్ట్‌ తీసుకుంటారు. మోతాదుకి మించకుంటే ఏం కాదు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఎక్కువగా తీసుకుంటే దంతాలు దెబ్బతింటాయి. దంతాలపై ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. దీంతో దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. నాలుకతో పళ్లను తడిమినప్పుడు గరుకుగా తగులుతుంటుంది. దీనికి ఇదే గుర్తు. వెంటనే నిమ్మరసం వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలి.
  • నిమ్మరసానికి నాలుకకు అవినాబావ సంబంధం ఉన్నట్లుంటుంది. కొన్నిరోజుల పాటు ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల నాలిక రుచి స్పందన పోతుంది. నాలుక మండుతుంది. అక్కడక్కడా పగుళ్లు ఏర్పడుతాయి. అసౌకర్యంగా అనిపిస్తుంది. దీంతో సరిగా మాట్లాడలేరు. ఇవి వారంపాటు అలానే ఉంటాయి.

Exit mobile version