యూరిన్ ఇన్ఫెక్షన్ కారణాలు ఏంటో తెలుసా ?

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవమన్న విషయం మనందరికీ తెలిసినదే.మన శరీరంలో టాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడానికి హానికరమైన టాక్సిన్స్ ను శరీరం నుండి యూరిన్ రూపంలో తొలగించడానికి సహాయపడుతుంది.

causes of urinary tract infectionsఅదే విధంగా, మనం తీసుకొన్ని ఆహారపదార్థాల ద్వారా మన శరీరంలో పునశ్హోషణము అనే ప్రక్రియ ద్వారా గ్రహించిన పొటాషియం, మినిరల్స్, విటమిన్స్, సోడియం, గ్లూకోజ్ మరియు ఇతర పదార్థాలు మూత్రం నుండి బయటికి పోకుండా చేస్తుంది. ఇవి మన శరీరం నుండి మనకు ఉపయోగకరమైన పదార్థాలు తొలగింపును నిరోధించడానికి సహాయపడుతుంది.

మనం తీసుకునే కొన్ని రకాల ఆహారం వళ్ళ కూడా యూరిన్ ఇన్పెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. దాంతో బ్యాక్ పెయిన్, విసర్జన సమయంలో మూత్రంలో మంట, మరియు జ్వరం లక్షణాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ కు మరో లక్షణం, చాలా త్వరగా యూరిన్ పోవాలనుకోవడం, అలసట, కాళ్లవాపులు, చేతులు, పాదాలు, లేదా మోచేతులు, రక్తంలో యూరిన్ లేదా మూత్రం విసర్జణలో కష్టం, కడుపు ఉబ్బరం, కళ్ళ ఉబ్బు, ఫింగర్ నెయిల్స్ వాపు, చర్మ సమస్యలు, వికారం మరియు వాంతులు, నోరు మెటాలిక్ టేస్ట్ కలిగి ఉండటం జరుగుతుంది.

యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోతే, కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. కిడ్నీ వ్యాధులకు సకాలంలో చికిత్సను అందివ్వకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ లేదా రీనల్ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణ సమస్య. ప్రతి పది మంది మహిళల్లో ఏడు, లేదా ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అందుకు ముఖ్యకారనం క్లోజ్డ్ ప్రాక్జిమిటి యురెత్ర, వైజినా, మరియు ఆనస్ వల్లే ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతుంది.మరి ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తో తగ్గించుకుందాం.

పార్ల్సే జ్యూస్:

causes of urinary infectionsయూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఫార్ల్సే జ్యూస్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది . ఎందుకంటే వీటిలో ఎక్కువ విటమిన్స్, న్యూట్రీషియన్స్, పొటాషియం, సోడియం, కాపర్, థైమిన్, మరియు రిబోఫ్లిన్ ఉంటుంది . పార్లేను నీళ్ళలో వేసి బాగా మరిగించి తర్వాత వడగట్టి చల్లార్చి త్రాగాలి.

అల్లం:

causes of urinary infectionsఅల్లం చాలా పాపులర్ హెర్బ్. అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, బ్యాక్టీరియా కిడ్నీలో వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. మరియు ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. అందుకు అల్లం టీ రెగ్యులర్ గా తీసుకోవాలి.

పెరుగు:

causes of urinary infectionsపెరుగులో ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా అధికంగ ఉండటం వల్ల ఇది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సహాయపడుతుంది . పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని పొట్టసమస్యలను నివారించడంలో చాలా సహాయపడుతుంది. కిడ్నీ రాళ్లను
నివారిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లియూరినరీ ఇన్ఫెక్షన్ నివారించడంలో పచ్చివెల్లుల్లి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పచ్చిగా తీసుకోవచ్చు. నేరుగా తినలేని వారు గార్లిక్ క్యాప్స్యూల్స్ తీసుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్తేనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీటి రెండింటిని మిక్స్ చేసి ఉపయోగించినప్పుడు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి ప్రతి రోజూ తీసుకోవాలి.

హెర్బల్ టీ:

హెర్బల్ టీహెర్బల్ టీ ఆరోగ్యానికి అన్ని విధాల మేలు చేస్తుంది. హెర్బల్ టీ డ్రింక్ చేయడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . చమోమెలీ టీ, మార్షమల్లో టీ, పార్స్లే టీ మరియు గోల్డెన్ రాడ్ టీలలో ఏదోఒకదాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు. ఈ టీని రోజులో ఒకటి రెండు సార్లు త్రాగాల్సి ఉంటుంది.

కలబంద:

కలబందఅలోవెర చాలా అద్భుతమైన మూలిక. దీన్ని ప్రతి రోజూ కొద్దికొద్దిగా తీసుకొన్నట్లైతే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది ఇది మూత్రపిండాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేసి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

విటమిన్ సి:

విటమిన్ సియూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో అసిడిక్ లెవల్స్ ను తొలగిస్తుంది . కాబట్టి ప్రతి రోజూ ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR