Home Unknown facts ఇక్కడ ఎనిమిది రోజులపాటు గంగమ్మ జాతర అద్భుతంగా జరుగుతుంది

ఇక్కడ ఎనిమిది రోజులపాటు గంగమ్మ జాతర అద్భుతంగా జరుగుతుంది

0

ఇక్కడ వెలసిన ఆ గంగమ్మ తల్లిని గ్రామస్థులు గ్రామదేవతగా కొలుస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే గంగమ్మ తల్లికి ఎనిమిది రోజులు పాటు జరిపే ఉత్సవంలో అక్కడి భక్తులు దేవిని తిట్టిపోస్తుంటారు. గంగమ్మను ఎంత తిడితే ఆమెకు అంత ఆనందమని ప్రతీతి. మరి ఆ తల్లి అక్కడ ఎలా వెలసింది? ఇంకా ఈ ఆలయంలోని విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం.

boyakondaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కీ.మీ. దూరంలో చౌడేపల్లి సమీపాన ఉన్న కొండపైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉన్నదీ. తిరుపతిలో ప్రతి సంవత్సరం చైత్రమాసం చివరన జరిగే గంగమ్మ జాతర విశిష్టమైనది.
ఇక స్థల పురాణానికి వస్తే, పూర్వము మన దేశాన్ని వాబులు పాలించే సమయంలో దక్షిణ భారతదేశంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ద్యేయంతో ఎన్నోసార్లు దండయాత్రలు చేసి అక్కడి జమిందారులను, పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేసెవారు.

పుంగనూరు సంస్థాన పరిసరప్రాంతాలపై గోల్కొండ నవాబులు తమ సైన్యాలతో దండెత్తి గ్రామాలలో చోడబడి దాడులు చేయడంతో ప్రజలు భయబ్రాంతులతో చెల్లా చెదురయ్యారు. నవాబు పదాతి దళాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివసించే బోయల గూడెములలో ప్రవేశించి భీబత్సం సృష్టించి, ఎందరో మహిళలను బలాత్కారానికి గురి చేశారు.

వీరి ఆగడాలను భరించలేని ప్రజలు భయంతో కొండగట్టుకు వెళ్లి తలదాచుకుని అమ్మవారిని ప్రార్ధించారు. వీరి మోర ఆలకించి ఆ శక్తిస్వరూపిణి వృద్ధురాలి రూపంలో వచ్చి బోయలకి దైర్యం చెప్పి వారందరిని ఓదార్చిందని ప్రతీతి. వృద్ధి రాలి రూపంలో ఉన్న శక్తిస్వరూపిణి తన ఖడ్గంతో నవాబు సేనలను హతమార్చింది. అమ్మవారి ఖడ్గ ధాటికి రాతిగుండ్లు సైతం నిట్టనిలువుగా చీలిపోయాయి. ఇప్పటికి కొండపైన నిట్టనిలువుగా చీలి కనిపించే అతి పెద్ద రాతి గుండుని మనం దర్శించవచ్చు.

ఆవిధంగా నవాబు సేనలను హతమార్చిన అమ్మావారిని తమతో పాటుగా ఉండమని ప్రార్ధించగా, ఆమె వారి కోరికమేరకు దొర బోయకొండ గంగమ్మగా ఆ కొండపైన వెలసి భక్తుల కోరికలను ఆనాటి నుండి తీరుస్తున్నది.

అయితే ఎనిమిది రోజుల పాటు ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మొదటిరోజు బైరాగి వేషంలో, రెండవరోజు బండ వేషంలో ఐదవరోజున మాతంగి వేషంలో భక్తులు అమ్మవారిని కొలుస్తారు. భక్తులు ఎనిమిది రోజులపాటు వేర్వేరు వేషాలతో దేవికి పూజలు జరుపుతారు. ఈ ఎనిమిది రోజులపాటు భక్తులు దేవిని తిట్టిపోస్తుంటారు. గంగమ్మను ఎంత తిడితే ఆమెకు అంత ఆనందమని ప్రతీతి.

ఈ అమ్మవారి ఆలయానికి భక్తులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి జంతు బలులు సమర్పించి తమ కోరికలు నెరవేర్చమని భక్తి శ్రద్దలతో గంగమ్మని ప్రార్థిస్తారు.

Exit mobile version