Pathalamlo Maro Prapancham Kaleshwaram Project

తెలంగాణ లో కోటి ఎకరాల మాగాణి చేస్తా అని ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు చెప్పారు. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. గత ఆరు శతాబ్దాలుగా చేప్పట్టిన నీటి పారుదల పథకాలు పది లక్షల లోపు నీరుని అందించగా, కేవలం ఈ ఒకే ఒక్క పథకం పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఒక టిఎంసి నీటితో 11,370 ఎకరాలు సాగవుతాయని చెబుతున్నారు. ఇంకా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఆసియాలోనే పెద్దవైన పంపుల నిర్మాణం ఇక్కడ చేపడుతున్నారు. 36 లక్షల మాగాణి సాగులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే ఇలాంటి ఎత్తి పోతల పథకం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఇంకా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్నో అధ్భూతమైన విషయాలు అనేవి ఉన్నాయి. మరి 40 వేలమంది కార్మికులు, రెండు వేల మంది ఇంజనీర్లు పనిచేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది? కాళేశ్వరం భూగర్భంలో సాగుతున్న జలయాగం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kaleshwaram Project

తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలంలోని, కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో 3 బ్యారేజ్ లు, 16 రిజర్వాయర్ లు ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరాను చేసే మొత్తం పొడవు 1832 కిలోమీటర్లు. ఇందులో వాల్ టన్నెల్ పొడవు 203 కిలోమీటర్లు, 20 లిఫ్ట్ లు, 19 పంప్ హౌస్ లు ఉపయోగించి నీళ్ళని రిజర్వాయర్ లకి తరలిస్తారు. మేడిగడ్డు నుండి రోజుకి రెండు టీఎంసీ ల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీ ల నీటిని తరలించే ప్రణాళిక రూపొందించారు.

Kaleshwaram Project

అయితే గోదావరి నది మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ప్రవేశించగా బాసర నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా ఎల్లంపల్లి నుండి మీదుగా కాళేశ్వరంలోకి ప్రవహించే గోదావరి నది ఒక పిల్ల కాలువల కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర నుండి పెనుగంగ, వార్థ నదులు, మధ్యప్రదేశ్ నుండి వచ్చే వెయిన్ గంగ నది మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులలో తుమ్మిడి హెడ్డి దగ్గర కలసి ప్రాణహిత నదిగా మారుతుంది. ఈ నది 110 కిలోమీటర్లు ప్రయాణించి కాళేశ్వరంలోని గోదావరి నదిలో కలుస్తుంది. అప్పుడు త్రివేణి సంగమం నుండి భద్రాచలం వైపు గోదావరి నది చాలా ఉదృతంగా ప్రవిహిస్తుంది.

Kaleshwaram Project

అయితే ప్రాణహిత నది నుండి చేవెళ్లకు నీటిని అందించేందుకు 2007 వ సంవత్సరంలో ఒక ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా రి డిజైన్ చేసారు. అయితే తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా ఈ కాళేశ్వరానికి రూపకల్పన చేసారు.

Kaleshwaram Project

గోదావరి నది ద్వారా ఇప్పటికే 18 లక్షల ఎకరాల ఆయకట్టతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మరొక 18 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు 134.5 టీఎంసీ నీరు అందబోనుంది. ఆయకట్టు స్థిరీకరణకు మరో 34.5 టీఎంసీ లు, హైదరాబాద్ తాగు నీటికోసం 30 టీఎంసీ లు, ఈ ప్రాజెక్ట్ మార్గ మద్యంలో ఉన్న గ్రామాలకి తాగు నీటి కోసం 10 టీఎంసీ లు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీ లు, మొత్తం నీటి వినియోగం 225 టీఎంసీ ల నీళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Kaleshwaram Project

గోదావరి నది నుండి నీటిని ఎగువకి ఎత్తి పోయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బ్యారేజ్ లను నిర్మిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఎప్పుడు 16 టీఎంసీ ల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్ట్ ని తయారు చేసారు. ఇక్కడి నుండి రోజుకి 2 టీఎంసీ ల చొప్పున 90 రోజుల పాటు 180 టీఎంసీ ల నీటిని పంప్ చేస్తారు. భవిష్యత్తు అవసరం కోసం మరో టీఎంసీ మొత్తంగా 3 టీఎంసీ లా నీటిని కూడా ఎత్తి పోసేందుకు వందల కిలోమీటర్లు కాలువలు, స్వరంగా మార్గాలు. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ సర్జుకుల్, పంప్ హౌస్ లు, దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ లు, రిజర్వాయర్ లు, గోదావరి నది పైన వరుసగా బ్యారేజ్ లను నిర్మిస్తున్నారు.

Kaleshwaram Project

కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న భూగర్భ ఎత్తుపోతల కేంద్రం ప్రపంచంలోనే మేటిదని పనులు చేపట్టిన మెగా ఇంజినీరింగ్‌ నిర్మాణ సంస్థ పేర్కొంది. భూమిపైనా ఎలాంటి అలజడి అనేది లేకుండా భూగర్భం ద్వారా రోజుకి రెండు టీఎంసీ ల నీటిని ఎత్తి పొసే అధ్బుతమైన నిర్మాణం ఇది అని చెబుతారు. ఇక పంప్ హౌస్ లో బిగిస్తున్న మోటార్స్ తో కొన్ని గంటల్లోనే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ని నింపేంత సామర్థ్యం ఈ పంపులకి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఏడూ మోటార్లు భూగర్భంలో ఉండగా, వాటిని తిప్పేందుకు కావాల్సిన 973 మెగావాట్ల విద్యుత్ కోసం విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఒకవేళ దీనిని భూమి పైన నిర్మించాలంటే దాదాపుగా 50 ఎకరాల స్థలం అనేది అవసరం ఉంటుంది, అదే భూగర్భంలో భూగర్భంలో 2 వేల క్యూబిక్‌ మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇలా అధునాతన సాంకేతిక వినియోగిస్తున్న 8వ ప్యాకేజీ భూగర్భ ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే మేటి అని చెబుతున్నారు.

Kaleshwaram Project

ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 80 వేల కోట్లతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని పనులు శరవేగంగా పూర్తిచేసుకుంటూ దసరా నాటికి రెండో పంటకు 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామంటూ అధికారులు వెల్లడించారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR