chidambara aalayam lo vunde adbhuthamaina 3 vinthalu yenti?

0
5253

ఇది ఒక శివాలయం. పురణాల గాధలననుసరించి శివుడు ఓం మంత్రాక్షరంతో చిదంబరంలో కొలువైవున్నట్లు చెప్పబడింది. అందువల్లనే శైవులకు ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైంది. పరమేశ్వరునికి సంబంధించిన ఐదు ప్రసిద్ధ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. ఈ ఆలయాన్ని శివుని ఆకాశ క్షేత్రంగా భక్తులు పరిగణిస్తారు. మరి ఈ చిదంబర ఆలయంలో ఉన్న ఆ వింతలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.chidambara temple
తమిళనాడు రాష్ట్రంలో ఈ దేవాలయం ఉన్నదీ. ఈ ఆలయంలో ఉన్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు. చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .ఈ విషయాన్ని తన గ్రంధం తిరుమందిరం లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.chidambara templeఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం. ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్పతికలింగ రూపం. రూపం లేని దైవసాన్నిధ్యం అనే 3 రూపాలలో స్వామి దర్శనమిస్తాడు. ఆ మూడో రూపమే చిదంబర రహస్యం.అందుకే ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు చిదంబర రహస్యం అంటారు.chidambara templeఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక అనీ అంటారు. అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . అంటే 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి . chidambara templeచిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . అలానే మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి. ఇంకా చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . అలానే మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . అదేవిధంగా ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది . chidambara templeదేవాలయం లో పొన్నాంబళం కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి . అది నమ శివాయః పంచాక్షరి ని సూచిస్తుంది. కనక సభ లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .chidambara templeప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు . మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.chidambara templeదేవాలయంలో వున్న నాలుగు అందమైన స్తంభాలు ఒక్కోటి ఒక్కో దిక్కులో వుంటాయి. దేవాలయంలోపలి భాగంలో కళానైపుణ్యం తొణకిసలాడుతుంది. ఈ దేవాలయం నాట్యానికి పుట్టినిల్లుగా గోచరిస్తుంది. ఇక్కడ వున్న ప్రతి రాయి, స్తంభంపై భరతనాట్య భంగిమలను తెలుపుతుంటాయి. ఎంతో నైపుణ్యంతో పరమేశ్వరుడు ఈ నాట్యాన్ని చేశాడనీ అందువల్లనే ఆయనను నటరాజ స్వామిగా కీర్తించారని చెప్పబడింది.chidambara temple

ఈ ఆలయంలో ఇంతటి వింతలు ఉన్నాయి కనుకే ఇది దక్షిణాది ప్రసిద్థమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.