కరోనా రాకూడదని చిన్న పిల్లలకి మల్టీ విటమిన్లు ఇస్తున్నారా?

గతేడాది వచ్చిన కరోనా వేరియంట్ పిల్లలపై చాలా తక్కువ ప్రభావం చూపించింది. దాని వల్ల కొవిడ్ బారినపడి చనిపోయిన వెయ్యి మందిలో ఒకరు మాత్రమే పిల్లలున్నారు. అంటే 0.1 శాతంగా ఉంది. పిల్లలు కొవిడ్ బారినపడినా సమస్య తీవ్రంగా లేదు. కాబట్టి హాస్పిటల్స్లోచేరాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడొచ్చిన డబుల్ మ్యుటెంట్ కరోనా వైరస్ పిల్లలు, యువతపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది.

Children Given Multi-Vitamins To Prevent Corona టీనేజర్స్, రెండు మూడేళ్ల పిల్లలే కాదు నెలల పసికందులు కూడా కొవిడ్ బారినపడుతున్నారు. ఇంతకుముందు కరోనా కేవలం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల రూపంలో కొంత దూరంలో ఉన్న వస్తువులపై పడేది. వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోకుండా, శానిటైజర్ పూయకుండా నేరుగా ముఖాన్ని తాకితే వైరస్ బాడీలోకి చేరేది. కానీ, ఇప్పటి కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోందని చెప్తున్నారు.

Children Given Multi-Vitamins To Prevent Coronaపెద్దలైతే మల్టి విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు. మరి మరి పసిపిల్లల విషయం ఏంటి? వాళ్లు మల్టీ విటవిన్ ట్యాబ్లెట్లు తీసుకోవచ్చా? పిల్ల‌ల‌కు కావాల్సిన పోష‌కాలు అన్నీ వాళ్లు తినే ఆహారం నుంచే అందుతుంది. అంతేత‌ప్ప ఆరోగ్యంగా ఉన్న పిల్ల‌ల‌కు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్లు లేదా సిర‌ప్ అందించ‌డం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మల్టీవిటమిన్లు అనేవి పసిపిల్లలకు కూడా అవసరమే కానీ, అవి కేవలం ఆహారం రూపంలో మాత్రమే వారికి అందాలి.

Children Given Multi-Vitamins To Prevent Coronaఇతర ప్ర‌త్యామ్నాయ పద్ధతుల్లో వారికి మల్టీ విటమిన్లను అందించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ పోష‌కాలు అంద‌క‌పోతే.. పోష‌కాలు ఉండే ఆహారం పెట్టాలి. దీనికోసం పిల్ల‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా తింటున్నారా, వ‌య‌సుకు త‌గ్గ బ‌రువు పెరుగుతున్నారా లేదా అనే విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉండాలి. డాక్టర్ సూచ‌న‌లు, సలహాలు లేకుండా పిల్లలకి మల్టీ విటమిన్లు లేదా పోషక పదార్ధాల సప్లిమెంట్లను ఇవ్వకూడదు.

Children Given Multi-Vitamins To Prevent Coronaమ‌రి అవ‌స‌ర‌మైతే డాక్ట‌ర్ స‌ల‌హాతో మల్టీ విటమిన్లు, పోష‌కాల స‌ప్లిమెంట్ల‌ను అందించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా పిల్ల‌ల‌కు స‌ప్లిమెంట్లు ఇస్తే.. అవి విష‌పూరిత‌మ‌య్యే అవ‌కాశం ఉంది. పిల్లల ఎదుగుదలతో పాటు ఆహారం సరిగా తినని పిల్లల్లో వైద్యుల సలహా మేరకు ఏమైనా సిఫార్సు చేస్తే విటమిన్ సప్లిమెంట్లు ఇవ్వొచ్చు. అది కూడా పరిమితంగానే అంటున్నారు.

Children Given Multi-Vitamins To Prevent Coronaసాధారణంగా చాలా మంది పిల్లల ఎదుగుదల లోపం ఉంటుంది. వయస్సు తగినట్టుగా ఎదగరు.. వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. ఇలాంటి పిల్లల్లో మాత్రమే మల్టీ విటమిన్లను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే పప్పులు, మాంసం, చేపలు, పాలు, గుడ్డుతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ తినేలా చూడాలి.

Children Given Multi-Vitamins To Prevent Coronaసమతులాహారంతో పిల్లల శరీర ఎదుగుదలకు, ఇమ్యూనిటీ పెరుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. పిల్లలకు పుట్టినప్పటి నుంచి వయసుని బట్టి కొన్ని వ్యాక్సిన్లు ఇస్తూ ఉంటారు. ఈ వ్యాక్సినేషన్ వల్ల పెరిగిన ఇమ్యూనిటీ న్యుమోనియా, క్షయ, ఫ్లూ, పోలియో రోగాలతో పాటు కరోనాని కూడా ఎదుర్కోవటానికి పనికొస్తుంది. కాబట్టి ఏ వ్యాక్సినేషన్ అయినా వాయిదా వేయొద్దు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR