Home Unknown facts ఈ ఆలయంలో దాదాపుగా 400 మీటర్లు ప్రయాణం చేస్తేనే శివలింగ దర్శనం

ఈ ఆలయంలో దాదాపుగా 400 మీటర్లు ప్రయాణం చేస్తేనే శివలింగ దర్శనం

0

పురాతన కాలం నుండి పూజలందుకొంటున్న ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే అందులో చాలా వరకు కొండపైన, గుహల్లో, అరణ్యప్రాంతాల్లో వెలసినవి. అలా ఒక కొండగుహలో వెలసిన ఆలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే కొండగుహలోని చిమ్మచీకట్లోనే దేవుడు దీపం వెలుగులో భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. మరి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ చీకటి మల్లయ్య ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

chikatiఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికొండలో దైద అమరలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ కొండగుహనే గుత్తికొండ బిలం అంటారు. ఇది అంతా కూడా చుట్టూ పర్వతశ్రేణి, మధ్యలో బిల సముదాయం. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బిలం.

ఈ బిలం యొక్క ప్రధాన ద్వారం అడుగుపెడపెట్టి లోపలి వెళుతుండగా చీకటి మల్లయ్య పూజలందుకుంటూ కనిపిస్తాడు. ఇక్కడ చిమ్మ చీకట్లో విద్యుత్ దీపాల వెలుగులో ముందుకు వెళుతుంటే మనకి ఒక నీటికొలను కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నీరు అందులో రూపాయి నాణెం క్రింద పడిన కనిపించేంత స్వచ్ఛంగా ఉంటాయి. ఆ స్వామి దర్శనానికి వచ్చిన వారంతా కూడా ఈ కొలనులో పుణ్యస్నానాలు చేస్తారు.

ఇక ఇక్కడ ఉన్న ప్రధాన బిలం నుండి లోపలి వెళితే 101 బిలాలు ఉన్నాయని చెబుతారు. ఇలా ఇంకా కొంచం ముందుకు వెళితే అక్కడ గరళం సేవించే శివుడి విగ్రహాం ఉందని చెబుతారు.

ద్వాపరయుగంలో కాలయవనుని బారి నుండి తప్పించుకున్న శ్రీకృష్ణుడు ఈ బిలంలోకి ప్రవేశించి అక్కడ తపస్సు చేస్తున్న ముచికుంద మహర్షి పైన తన ఉత్తరీయాన్ని కప్పి పక్కకు వెళ్తాడు. అయితే ఆయనే శ్రీకృష్ణుడు అని భావించిన రాక్షసుడు ఆ మునికి తపోభంగం కలిగించడంతో ఆగ్రహించిన ముని ఆ రాక్షసుడిని భస్మం చేసినట్లు పురాణం.

ఈ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వరంగా మార్గంలో స్వయంభువుగా వెలసిన ఈ స్వామి భక్తుల పూజలందుకొనుచున్నాడు. ఇక్కడ ఉన్న సొరంగ మార్గం లో దాదాపుగా 400 మీటర్లు ప్రయాణం చేసి శివలింగాన్ని చూడాల్సి ఉంటుంది. ఇలా వెలసిన ఆ స్వామిని దర్శనం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

Exit mobile version