మామిడికాయలపై విష ప్రయోగం జరుగుతుందా ? ఇది చూస్తే నమ్మక తప్పదు

మామిడి కాయల సీజన్ మొదలైందంటే చిన్నా పెద్దా అందరికి పండగే ఎందుకంటే మామిడిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.. కానీ ఇపుడు ఆ మక్కువే మన మరణాన్ని శాశిస్తుందా అంటే.. అవుననే చెప్పాలి.. వినటానికి ఇబ్బందిగా అనిపించినా సరే.. మార్కెట్లో వస్తున్న మామిడికాయలు తింటే మాత్రం ఇక అంతే.. మనకిక మరణమే గతి.

Mangoఎందుకు, అసలు ఏమవుతుంది.. అంటే మామిడికాయలపై విష ప్రయోగం జరుగుతుంది.. అది కూడా చైనా నుండి దిగుమతి చేసి మరీ.. ఇదేంటి మామిడి కాయలపై విష ప్రయోగమా అని ఆశ్చర్య పోకండి.. ఇది జరుగుతున్న తీరు తెలిస్తే షాక్ కి గురవటమే కాదు.. భయకంపితులై పోతారు.. ఇకపై మామిడి ముట్టలేరు.. ఈ విష పూరిత మామిడి పండ్లను తింటే కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయని అంటున్నారు.

ethyleneచిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇది ఇంకా ప్రమాదకారి కావచ్చు.. మరి ఇంత ప్రమాదకరమైన విషాన్ని ఎలా నింపుతున్నారు.. అంటే .. కాయల్ని పండ్లుగా మగ్గబెట్టే ప్రాసెస్ లో భాగంగా ఈ ప్రమాదకర విషాన్ని వాడుతున్నారు.. ఆ విషం పేరే ఎథెఫాన్…. మార్కెట్లలో కార్బైడ్ను వాడటం నిషేదించాక ఇథిలిన్ ని వాడటం మొదలు పెట్టారు.. ప్రముఖ మార్కెట్లలో ఈ ఇథిలీన్ రైపనింగ్ చాంబర్స్ కూడా ఉన్నాయి.. కానీ దీని ద్వారా కాయలు పండ్లు కావాలంటే 72 గంటలు వెయిట్ చేయాలి.. అంతే కాదు ఇది ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్.. కానీ కొంతమంది వ్యాపారాలు అంత టైం ఆగలేక అక్రమ మార్గంలో కాయలపై విషప్రయోగం చేసి మరీ.. కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చేసి బయట అమ్మకాలు సాగిస్తున్నారు..

ethyleneమరి ఇదంతా అధికారులకి తెలియదా అంటే.. ప్రభుత్వం కళ్లుగప్పి ఇథిలీన్ దిగుమతి పేరుతొ ఈ ప్రమాదకర ఎథెఫాన్ ని అక్రమంగా తెప్పించి ఇలా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.. అసలు ఈ ఎథెఫాన్ ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే రీసెంట్ గా మనం చుసిన ఏలూరు ఘటనే నిదర్శనం.. 600 మంది ఆరోగ్యం పాడవటానికి పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, ఆర్గనో క్లోరైన్, ఆర్గనో ఫాస్పేట్ కారణమని ఎయిమ్స్, ఐఐసీటీ, ఎన్ఐఎన్ వంటి ప్రముఖ సంస్థలు చెప్తున్నాయి..

ethyleneఈ ఎథెఫాన్ కూడా ఆర్గనోఫాస్పేట్కు సంబంధించిందే.. ఈ ఎథెఫాన్ పౌడర్ వాడి పండించిన పండ్లు తింటే ఫ్యూచర్ లో ఏలూరు లాంటి ఘటనలు మరెన్నో చూడాల్సిన పరిస్థితి తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ethyleneప్రస్తుతం మార్కెట్లో వ్యాపారాలు విచ్చల విడిగా ఈ ఎథెఫాన్ ని వినియోగిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకుంటున్న పరిస్థితి కనపడటంలేదు.. అధికారుల అలసత్వమే దీనికి కారణం గానూ కొంతమంది వ్యాపారాలు చెప్తున్నారు.. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రజల్ని కాపాడాలి..అంతే కాదు, ఇలాంటి వాటిని కంప్లీట్ గా బ్యాన్ చేయాల్సిన అవసరముంది..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR