Home Health లిఫ్ట్ కి బదులు మెట్లు ఎక్కితే చాలు, జిమ్ కి వెళ్ళినట్టే!

లిఫ్ట్ కి బదులు మెట్లు ఎక్కితే చాలు, జిమ్ కి వెళ్ళినట్టే!

0
ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మనకు బద్దకాన్ని పరిచయం చేసింది. కూర్చున్న చోటుకే ప్రపంచం వస్తున్నప్పుడు ఎందుకు కష్టపడటం అన్నట్టు తయారయ్యారు. ఈ క్రమంలోనే మెట్లు వాడకం తగ్గిపోయింది. అపార్ట్‌మెంట్స్‌, ఆఫీసులు ఇలా ఎక్క‌డ చూసినా లిఫ్ట్‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.దీంతో అంద‌రూ మెట్లు ఎక్క‌డం మానేసి, లిఫ్ట్‌ల‌నే ఎక్కువ‌గా యూజ్ చేస్తున్నారు.
  • తొంభైశాతం మంది లిఫ్టును వాడేందుకు ఇష్టపడుతున్నారు. క‌నీసం ఇంట్లో ఉండే మెట్ల‌ను ఎక్క‌డానికి కూడా కొంద‌రు బ‌ద్ద‌కిస్తుంటారు. మెట్లు ఎక్కాలి అంటే అబ్బో మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, అంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. కానీ, అది వాడడం మానేసి రోజూ మెట్లెక్కి దిగడం చేస్తే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
  • అతి ఉత్త‌మ‌మైన వ్యాయామాల్లో మెట్లు ఎక్క‌డం ఒక‌టి. రోజూ మెట్లు ఎక్కి దిగండి చాలు… జిమ్ కూడా అవసరం లేదు. రోజుకు క‌నీసం ఒక పావు గంట పాటు మెట్లు ఎక్కి, దిగ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజుకు పావు గంట పాలు మెట్లు ఎక్క‌డం, దిగ‌డం చేస్తే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా వెయిల్ లాస్ అవ్వొచ్చు.
  • జాగింగ్ ద్వారా కంటే మెట్లు ఎక్క‌డం, దిగ‌డం ద్వారానే ఎక్కువ కేలరీలను క‌రిగించుకోవ‌చ్చు. కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారు ఈ వ్యాయామాన్ని ఎంచుకోవ‌డం బెస్ట్ అప్ష‌న్‌. తరచూ మెట్లు ఎక్కడం వల్ల శరీరం టోన్ అవుతుంది. తద్వారా శరీరం మంచి ఆకృతిని పొందుతుంది. రోజు మెట్లు ఎక్కి దిగడం చేస్తే కొన్ని వారాలకే శరీరంలో మార్పును గమనించవచ్చు.
  • అలాగే రెగ్యుల‌ర్‌గా మెట్లును ఎక్క‌డం, దిగ‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, మాన‌సిక ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. నేటి కాలంలో ఎంద‌రినో ప‌ట్టి పీడిస్తున్న నిద్ర లేమి స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలోనూ ఈ వ్యాయామం ఉప‌యోగ‌ప‌డుతుంది.అ వును, ప్ర‌తి రోజు పావు గంట పాటు మెట్లు ఎక్క‌డం, దిగ‌డం చేస్తుంటే మంచి నిద్ర ప‌డుతుంది.
  • మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. తద్వారా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా ఎక్కువ. అంతేకాదు, కండ‌రాలు నొప్పులు త‌గ్గి దృఢంగా మార‌తాయి. కానీ మెట్లు ఎక్కి దిగేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మెట్లు ఎక్కి, దిగేటప్పుడు షూ వేసుకోవడం ఇంకా మంచిది.
  • ఇవి మడమ భాగంలో మందంగా, మెత్తగా, ఫ్లెక్సిబుల్ గా ఉండే లాగా చూసుకోవాలి. శరీరంలోని కండరాలు దృఢంగా మారుతాయి. చాలామందికి తొడల భాగం బాగా లావుగా ఉండి, మిగతా భాగం సన్నగా ఉంటుంది. ఇలాంటి వారు కూడా రోజూ మెట్లెక్కి దిగడం వల్ల తొడ భాగంలో ఉన్న కొవ్వు ఇట్టే కరుగుతుంది. నిత్యం మెట్లు ఎక్కి, దిగితే. మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  • ఒక అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కి దిగడం వల్ల తలనొప్పితో పోరాడే శక్తి, తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. శరీరంలో రక్తప్రవాహం ఆరోగ్యకరంగా ఉండడం వల్ల నరాలలో తలనొప్పి దారితీసే లక్షణాలు తగ్గుతాయి. కనుక తలనొప్పిని వదిలించుకోవడానికి ఇది సులువైన వ్యాయామం. కాబ‌ట్టి, మెట్లు ఎక్కడాన్ని అల‌వాటు చేసుకోండి.

Exit mobile version