Home Health కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచవచ్చా

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచవచ్చా

0

ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. ఎటువంటి ఆరోగ్య సమస్యలెదురైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. సమస్య నుంచి సగం విముక్తి పొందినట్లే.. మరి అంతటి ఔషధ గుణాలున్న కొబ్బరి నీళ్లు సహజంగా తీయ్యగా ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తీసుకోవడానికి భయపడుతుంటారు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని కొబ్బరి నీళ్లు తాగకుండా దూరం పెడతారు.

coconut waterకొంతమంది కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది కనుక రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని త్రాగడానికి భయపడుతుంటారు. అయితే అలాంటివన్ని కేవలం అపోహలే అంటున్నారు పరిశోధకులు. కొబ్బరి నీళ్లు తాగేవారిలో షుగర్ లెవల్స్ పెరగడానికి బదులుగా తగ్గుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇన్సులిన్‌కి స్పందించే గుణాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెరను తగ్గించే మెగ్నీషియం విరివిగా ఉన్నందువల్ల టైప్-2 డయాబెటీస్, ప్రీ-డయాబెటిక్స్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని రక్తనాళాలు వెడల్పై రక్తం సులభంగా ప్రసరిస్తుంది.

అలాగే కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాళ్లు, చేతుల వాపును తగ్గిస్తాయి. కొబ్బరి నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి షుగర్ పేషేంట్స్ ఎటువంటి అనుమానం లేకుండా కొబ్బరినీరు తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఉండే పోషకాల వల్ల శరీరానికి అధిక శక్తి అందుతుంది. తక్కువ మొత్తంలో ఉండే సోడియం, చక్కెర, ఎక్కువ మొత్తంలో ఉండే క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరం హైడ్రేట్ అవడమే కాకుండా పునరుత్తేజితం చెందుతుంది.

కొబ్బరి నీరును రోజూ ఉదయం పరగడపున త్రాగితే మంచిది. వీటిలోని ఖనిజలవణాలు శరీరానికి పుష్కలంగా అంది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి నీళ్ళలో ఉండే ఫ్రక్టోజ్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కొబ్బరి నీటిలో తక్కువ ఫ్రక్టోజ్ ఉంటుంది. మరియు ఫ్రక్టోజ్ మీ రక్తంలో చక్కెర స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఇక మధుమేహ వ్యాధి గ్రస్తులు గుర్తించుకోవల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కొబ్బరి బోండాం చాలా లేతగా కొబ్బరి లేని కాయలను ఎంపిక చేసుకోవాలి. లేత కొబ్బరి బొండాంలోని నీరు వగరుగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది.

 

Exit mobile version