మహాభారత యుద్ధంలో కృష్ణుడు, అర్జునుడు పూరించిన శంఖాల విశిష్టత?

భారతీయుల ప్రాచీన పురాణ గ్రంధాల్లో మహాభారతం ఒకటి. పంచమవేదంగా ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రస్తుతం ఆధునికత పేరుతో కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడు పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకీ సరిపడేటట్టు సామాజిక జీవన శైలిని ఎలా మలచుకోవాలో మనకు మహాభారతం చెప్తుంది. మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. మహా భారతం మనకి మన దేశ చరిత్రని చెప్పటంతో పాటు జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది…

mahabharatభారతంలో ముఖ్యమైన పాత్రలలో అర్జునుడు ఒకరు. అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం, దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం. యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అని నిరూపించాడు. అయితే యుద్ధానికి ముందు అర్జునుడు పూరించిన శంఖం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి…

arjuna with dronacharyaదేవతలు రాక్షసుల మధ్య హోరాహోరీగా అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవి, చంద్రుడు, కల్పవృక్షం, శంఖం వంటి 14 రత్నాలు ఉద్భవించాయి. సముద్రం నుంచి శంఖం ఉద్భవించడంతో శ్రీ మహావిష్ణువు పాంచజన్య అనే శంఖాన్ని ధరించడం వల్ల శంఖానికి అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.

14 gemsశంఖం సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి తరువాత ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి వారసురాలిగా భావించి పూజిస్తారు.శంఖం నుంచి వెలువడే ధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తి ప్రతిష్టల ఆగమనానికి ప్రతీకగా చెబుతారు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖం పూరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన శంఖం అయిన దేవదత్తం అనే శంఖం పూరించి రంగంలోకి దిగి యుద్ధ వీరులుగా తిరిగి వస్తారు.

arjun with conch chellదేవదత్తం అనగా దేవుడి నుంచి పొందినదని అర్థం. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు.1.దక్షిణావృత శంఖం: ఈ శంఖం ఎడమ చేతిలో పట్టుకొనే శంఖం.దీనిని పూజలో మాత్రమే ఉపయోగిస్తారు.2.ఉత్తరావృత శంఖం: ఈ శంఖం మధ్యలో నోరు ఆకారాన్ని కలిగి ఉంటుంది.ఈ శంఖాన్ని పూజా సమయాలలో, లేదా ఇటువంటి మహత్తర కార్యాలను ప్రారంభించేటప్పుడు ఊదడానికి ఉపయోగిస్తారు.3.మద్యావృత శంఖం: ఈ శంఖాన్ని కుడిచేతిలో పట్టుకుంటారు. శంఖం లక్ష్మీదేవికి వారసురాలిగా భావిస్తారు.

parts of conchఈ శంఖాన్ని కూర్మ పీఠం పై తివాచీని పరిచి దానిపై శంఖమును పెట్టి పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. శంఖంలోకి నీరు పోసిన కొద్దిసేపటికి అది పవిత్ర గంగాజలంగా మారుతుంది కాబట్టి, శంఖంలో నీటిని పోస్తేనే తీర్థం అని నానుడి ఏర్పడింది.
పూజ గది లో ఉన్న శంఖానికి పాలు, నీరు, తేనె మొదలైన వాటితో అభిషేకం చేసే పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగి పోతాయి.వాస్తు దోషం తొలగి పోవడానికి ఎర్రటి ఆవుపాలను శంఖంలో పోసి మన ఇంట్లో చల్లడం ద్వారా వాస్తు దోషం తొలగిపోవడమే కాకుండా, సకల సంపదలు కలుగుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR