ఆరోగ్యానికి అన్నీటికి రాగి పాత్రలనే వాడొద్దట!

కరోనా కలకలం తరువాత ఆరోగ్యం మీద అందరికీ శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యానికి చాలా మంచివి అంటూ ఈ మధ్యకాలంలో ప్రచారం పెరిగిపోవడంతో చాలామంది వంటకోసం, తాగే నీళ్లను స్టోర్ చేసుకోవడం కోసం రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. దాంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి పూర్వం నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు ఉండేవి కావు. దీంతో మన పెద్దలు రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగేవారు. మనం ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో రాగి గ్లాసులు, రాగి పాత్రలు చూస్తు ఉంటాం.

copper vessel waterఈ సీక్రెట్ తెలుసుకోడానికి జరిపిన పరిశోధనల్లో.. షాకింగ్ విషయాలు తెలిశాయి. రాగి పాత్రల్లో నీటిని వేస్తే.. సూక్ష్మ జీవులు నాశనమవుతాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆరోగ్యం కోసం రాగి పాత్రలను సిఫార్సు చేస్తున్నారు. మార్కెట్లో ఇప్పుడు రాగితో తయారు చేసిన బాటిళ్లు, జగ్గులు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ఫ్యూరిఫైర్లు సైతం ఇప్పుడు రాగితోనే వస్తున్నాయి. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం ఎప్పటి నుంచో చెబుతోంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం సహకరిస్తుంది. క్యాన్సర్ ముప్పు సమస్యను రాగి తగ్గిస్తుంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడతాయి. రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు రాగి నీరు మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి రాగి కాపాడుతుంది. కాలేయం, కిడ్నీల చక్కగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. పోషకాలను శరీరానికి అందించేందుకు సహకరిస్తుంది.

copper vesselరాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. కడుపులోని ఏర్పడిన పుండ్లను నయం చేయడానికి రాగి సహకరిస్తుంది. అల్సర్లు తగ్గేందుకు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. రాగి పాత్రలోని నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానేందుకు కూడా రాగి నీరు సహకరిస్తుంది. రాగి పాత్రలో నీటికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం సామర్థ్యం ఉంది. కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది.

arthritisఅయితే రాగిపాత్రలను ప్రతిసారీ ఉపయోగించడం అంత సేఫ్ కాదనే విషయం చాలా మందికి తెలియదు. రాగి మన శరీరంలోకి చేరడం వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర సమస్యలు కలుగుతుంటాయి. కడుపులో గ్యాస్, వాంతులు, విరేచనాలు తిమ్మిరి లాంటివి రావడానికి కారణం రాగి అధికంగా వాడటం వల్ల ఉండవచ్చు అని మనం గ్రహించాలి .మనిషి మెటబాలిసం ప్రకారం మన శరీరం రాగిని చిన్న మొత్తంలో ప్రాసెస్ చేయగలదు, కానీ అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.

bone stonesరాగిపాత్రల్లో వండినప్పడు, లేదా నిలువ ఉంచినప్పడు కొన్ని పదార్థాలు నెగటివ్ రియాక్షన్స్ ని ఇస్తుంటాయి.. మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి గిన్నెల్లో స్టోర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పుల్లదనానికి రాగిలో ప్రతిచర్యలు జరిగి అది తిన్నప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారచ్చు..అలాగే
వెన్న, క్రీం , పాలను స్టోర్ చేసినప్పడు కూడా అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

ఇక నిమ్మరసం, నారింజ రసం లాంటి సిట్రస్ జూస్లను రాగి గ్లాసుల్లో ఉంచితే డేంజర్ పెరుగును కూడా చాలామంది రాగి గిన్నెల్లో తోడు వేస్తుంటారు..అయితే అందులో ఉండే యాసిడ్స్ కాపర్ తో రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించకపోవడమే మంచిది. రాగి పాత్రలను ఉపయోగిస్తూ పిల్లల్లో గ్యాస్ కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే రాగి పాత్రలు పక్కన పెట్టి, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న వంటసామాన్లను వాడటం మంచిది.

bone stonesరాగి పాత్రల్లో ఏదైనా వంట చేసినప్పుడు, అది మాడిపోతే.. ఆ పాత్రలను తరువాత వాడకుండా వదిలేయడమే మంచిది..ఎందుకంటే, ఆ పాత్రలని అలాగే ఉపయోగిస్తూ వెళితే ఎక్కువ శాతం కాపర్ వచ్చి ఫుడ్ లో చేరే అవకాశముంటుంది. అందుకే రాగి పాత్రలను, బాటిల్స్ ని ఎంఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అన్న విషయాలు సరిగ్గా తెలుసుకొని వాడటం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR