Dargah famous avvadaniki aa bandaraye karanama?

0
14022

ఈ విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కొందరు సైన్స్ ద్వారా రుజువు అయితేనే వాటిని నిజం అని నమ్ముతారు. అయితే సైన్స్ మేధస్సుకు అందని ఎన్నో వింతలు విశేషాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే ఆ వింతల వెనుక దేవుడు ఉన్నాడా లేదా అది ప్రకృతి వైపరీత్యమా అనేది కొన్నిటిని తేల్చడం చాలా కష్టం. అలాంటి విశేషల్లో ఒకటి ఆజ్మీర్ దర్గాలో కూడా ఉంది. మరి ఆ విశేషం ఏంటి? ఆ దర్గా ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. dargahరాజస్తాన్ లోని ఆజ్మీర్ అనే ప్రాంతంలో ఆజ్మీర్ దర్గా ఉంది. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఈ దర్గాను దర్శించేందుకు వస్తుంటారు. ఎందుకంటే ఆజ్మీర్ దర్గాలో ఓ పెద్ద బండరాయి అందరిని ఆకట్టుకుంటుంది. దానికి కారణం ఏమిటి అంటే ఈ బండరాయి భూమి నుంచి రెండు అంగుళాల ఎత్తులో ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. dargahఇలా ఈ రాయి గాలిలో ఎందుకు తేలుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. సైన్స్ కూడా నిరూపించలేకపోయింది. ఈ కారణంగానే దర్గా భక్తులను ఆకట్టుకుంటుందని అక్కడి బోధకులు చెప్పుతుంటారు.dargahఇంకా ఆజ్మీర్ దర్గాలో ప్రతిరోజూ రెండు కుండల్లో వంట చేస్తారు. బియ్యం, చిరుధాన్యాలు, నెయ్యి, చెక్కర, కుంకుమపువ్వు వంటి వాటితో ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ఆహారాన్ని ఉదయం దర్గాకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. అయితే ఇక్కడ కేవలం శాఖాహారం మాత్రమే వండుతారు.dargahఅంతేకాదు, ఈ దర్గా తలుపులను సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. అది ఎప్పుడు అంటే ఉరుసు ఉత్సవం జరిగేరోజు ఒకసారి, రంజాన్ సమయంలో రెండు సార్లు, ఖ్వాజా సాహెబ్ పీర్ ఉరుసు సమయంలో ఒకసారి దర్గా తలుపులు తెరుస్తారు. 6 Durga Ajmirఇంతటి ఆశ్చర్యాన్ని కలిగించే గాలిలో తేలియాడే బండ ఉన్నందువలనే రాజస్థాన్ లోని ఆ దర్గాని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.