మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము?

0
5038

దీపావళి పండుగ వచ్చిందంటే అందరు తెల్లటి దుస్తులు ధరించి, ఇంటిని దీపాలతో అలకంరించి, లక్ష్మి పూజ చేసి, బాణసంచాలు కాలుస్తుంటారు. మరి అసలు దివాలీ అంటే ఏంటి? దివాలీ పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1 Diwali Celebrationమన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంది. మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఆనందోత్సాహాలతో చిన్నా, పెద్దా తేడా లేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దివాలీ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు.

diwali

దీపావళి అంటే దీపాల వరుస. ‘అజ్ఙానం’ అనే చీకటి నుంచి పారద్రోలడానికి ‘జ్ఙానం’ అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం. దీపావళి రోజు చెడు నశించిన రోజు, ధర్మసంస్థాపనతో జగత్తులో వెలుగు నిండిన రోజు. ‘దీపం’ అంటే త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని ‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి, ‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి, ‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.

Diwali

దివాలీ రోజు వెలిగించే ప్రతి దీపానికి కూడా మూడు వత్తులు తప్పకుండ ఉండాలి. ఎందుకంటే ముల్లోకాలలోని అంథకారాన్ని పారద్రోలి మన ఇల్లు లక్ష్మి దేవి నిలయంగా అవుతుంది. అయితే మనం వెలిగించే దీపాన్ని ఆవు నేతితోగానీ, నువ్వుల నూనెతోగానీ భక్తిగా వెలిగించాలి.

Diwali

ఇంత గొప్పగా జరుపుకునే దివాలీ పండుగకి కొన్ని పురాణ కథలు ఉన్నాయి.

బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. అప్పుడు సర్వలోకాలూ ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి అని చెబుతారు.

Diwali రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దివాలీ పండుగనుమనం జరుపుకుంటున్నాం అని ఒక కథ వెలుగులో ఉంది.

Diwaliమరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. అందుకే సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దివాలీ నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

Diwaliకౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలికారని మరో పురాణ కథ మనకు తెలియచేస్తుంది.

Diwaliమనలోని చీకటిని ప్రాలదోరి, జీవితంలో వెలుగును నింపుకునేందుకు చిహ్నంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ.

రహస్యవాణి ప్రేక్షకులకి మా తరుపు నుండి దీపావళి శుభాకాంక్షలు.