కరోనాని తలపిస్తున్న డెంగ్యూ D2 వేరియంట్!

మన దేశంలో కరోనా కేసులు మళ్ళీ చాపకింద నీరులా పాకిపోతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. మూడో వేవ్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న భారత్‌లో తాజాగా డెంగ్యూ వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

dengueవైరల్ జర్వాల వ్యాప్తికి అనువైన వాతావరణం ఉండటంతో దేశవ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది తీవ్రమైన వ్యాధిగా మారుతూ ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. తీవ్రమైన డెంగ్యూ కారణంగా మరణాల ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏఈ అల్బోపిక్టస్ జాతి దోమలు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేయగలవు.

aedis egyptiఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. డెంగ్యూ ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ ఇతర తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు సైతం కారణమవుతుంది. బాధితుల్లో కొంతమందికి ఇది సబ్‌క్లినికల్ డిసీజ్‌గా కనిపించవచ్చు. అంటే వ్యాధి సోకినట్లు బాధితులకు తెలియకపోవచ్చు. తీవ్రత పెరిగే కొద్దీ తీవ్రమైన ఫ్లూ లక్షణాలు కనిపించవచ్చు. డెంగ్యూలో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 2 నుంచి 7 రోజుల పాటు కొనసాగుతాయని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.

mosquito biting handఅయితే సాధారణంగా వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ 4 నుంచి 10 రోజులు ఉంటుంది. క్లాసిక్ డెంగ్యూ జ్వరం సోకిన వారికి తలనొప్పి, వికారం, వాంతులు, వాపు, గ్రంథులు, కండరాల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డీ2 వంటి తీవ్రమైన డెంగ్యూ లక్షణాల దగ్గరకొస్తే.. బాధితులు కొంతకాలం తర్వాత కోలుకుంటున్నట్లు కనిపిస్తాడు. కానీ 3 నుంచి 7 రోజుల తర్వాత పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తం వాంతులు, వేగవంతమైన శ్వాస, అలసట లాంటి లక్షణాలు వీరిలో ప్రమాదకరంగా మారుతాయి.

breathing problemఅంతేకాకుండా ప్లాస్మా లీకేజ్, తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి పరిస్థితి చేజారిపోయే దశకు చేరుకుంటారు. తీవ్రమైన డెంగ్యూకి తగిన చికిత్స అందించకపోతే బాధితులు మరణించే ప్రమాదం ఉంది. అందుకే డెంగ్యూ D2 వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డెంగ్యూ బారిన పడకుండా ఉండటం మన చేతుల్లోనే ఉంది. డెంగ్యూకు వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు లేవు. కానీ రోగుల లక్షణాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది.

plasma leakageఅందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు వైద్యుల సలహా తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టాలి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ చేసిన నీటిని తాగడం మానుకోవాలి. పగటి పూట దోమలు ఎక్కువగా దాడి చేయకుండా.. చేతులు, కాళ్లను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నిత్యం వేడివేడి ఆహారాలను తీసుకోవాలి.

mosquitoes on handనీరు లేదా ఇతర ద్రవాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. అనాల్జెసిక్స్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోకుండా చూడాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. దోమలు పెరుగకుండా ఉండేందుకు నిల్వ నీటిలో కిరోసిన్‌ చల్లాలి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ కాకుండా ఉండేందుకు పాత టైర్లు, పగిలిపోయిన కుండలు, ఇంటి ముందు రోడ్డుపై గుంతలు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR