మన దేశంలో సాధారణంగా ఒక్కో దేవాలయం ఒక్కో ప్రదేశంలో ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఎకరాల విస్తీర్ణంలో కొన్ని దేవాలయాలు ఒకే చోట భక్తులకి దర్శనం ఇస్తుంటాయి. ఆలా ఈ ప్రదేశంలో వెలసిన ఈ మందిరాల సమూహం మన దేశంలోనే రెండవ అతిపెద్ద మందిరాల సమూహం అని చెబుతున్నారు. మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ఇక్కడ వెలసిన ఆ దేవతామూర్తులు ఎవరనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ ఢిల్లీ ఛత్తర్పూర్ లో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ ఆద్యకాత్యాయని శక్తిపీఠ మందిరం అని, ఛత్తర్పూర్ మందిరం అని పిలుస్తారు. ఇక్కడ దుర్గాదేవి అవతారమైన కాత్యాయనీ దేవి విగ్రహం ఉంది. ఈ కాత్యాయనీ దేవిని కులాలకు, మతాలకి అతీతంగా అందరు ఈ ఆలయానికి వచ్చి ఈ మాత ఆశీస్సులు పొందుతారు. ఇక ఈ దేవాలయాన్ని దుర్గామాత భక్తుడైన స్వామి నాగపాల్ మహారాజు నిర్మించారు. ఈ ఆలయం అంత కూడా తెల్లని పాలరాయితో నిర్మించబడింది. ఈ ఆలయం అంత కూడా దక్షిణ భారత శిల్పకళా శైలితో చెక్కబడి చాలా అధ్బుతంగా ఉంటుంది. ఈ ఆలయం 70 ఎకరాల విస్తీర్ణంలో మూడు సముదాయాలలో సుమారు 20 చిన్న, పెద్ద ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మందిరంలోని ఆవరణలోనే నాగపాల్ మహారాజు సమాధి మందిరం కూడా ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ భక్తులు వారి కోరికలు నెరవేరడం కోసం ఈ ఆలయంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మకి పవిత్ర దారాలు కడతారు. ఇలా మనసులో ఏదైనా కోరిక అనుకోని చెట్టు కొమ్మకి దారం కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలలో రెండు ప్రధాన ఆలయాలు ఉండగా అందులో ఒకటి దుర్గాదేవిగా పిలువబడే మహాగౌరి ఆలయం. ఈ ఆలయ విశేషం ఏంటంటే, భక్తుల కోసం ఈ దేవాలయం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఇక రెండవ ఆలయమే కాత్యాయనీ ఆలయం ఈ ఆలయం మాత్రం కేవలం ప్రతి మాసంలో అష్టమినాడు మాత్రమే తెరుస్తారు. ఇంకా నవరాత్రి పర్వదినాలలో తెరిచి ఉంటుంది. కాత్యాయనీ దేవి విగ్రహం పూర్తిగా బంగారం తో చేయబడింది. పట్టు వస్త్రాలు అలంకరణతో, మెరిసే నగలతో, పెద్ద పూలదండతో ఈ విగ్రహాం అలరారుతూ ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించాడనికి నవరాత్రి సమయాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.