ఈ శివాలయంలో పీతలను సమర్పిస్తే చెవి సమస్యలు దూరం అవుతాయట !

0
811

భక్త కన్నప్ప శివుడికి భక్తితో మాంసం నైవేధ్యంగా పెట్టిన స్వీకరించాడు ఆ బోళాశంకరుడు. భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించినా , నీటితో అభిషేకించిన ప్రీతీ చెంది పరమేశ్వరుడు కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. అలాగే గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా బ్రతికి ఉన్న పీతలను సమర్పిస్తారు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది, అలా ఎందుకు చేస్తారో చూద్దాం.

రామనాథ్ శివ ఘేలా ఆలయంగుజరాత్ రాష్ట్రంలో సూరత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీ.శ. 9వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వస్త్ర, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. సూరత్‌ను క్రీ.శ. 9వ శతాబ్దంలో సూర్యపూర్ అని పిలిచేవారు. ఆ తరువాత 12వ శతాబ్దంలో పార్శీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మొఘల్ వంశ రాజులు సూరత్‌ను ఎన్నో విధాలుగా అభివృద్ధిపరిచారు.

రామనాథ్ శివ ఘేలా ఆలయం ముఖ్యంగా ఐరోపా దేశాలతో నేరుగా వ్యాపారం జరిపేవారు. ప్రపంచ మార్కెట్‌లోని అన్ని వజ్రాలు దాదాపు 90%కి పైగా ఇక్కడే కోసి మరగబెట్టుతారు. మన్నిక, నాణ్యమైన వజ్రాలకు సూరత్ పేరుగాంచినది. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది.

రామనాథ్ శివ ఘేలా ఆలయంఅందుకు నిదర్శనం గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న శివాలయం. పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందిన గల్టేశ్వర్, శివునికి అంకితం చేయబడిన ఆలయం. భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని చాలా మంది నమ్ముతారు. శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలనైనా తీర్చగలడని విశ్వసిస్తారు.

రామనాథ్ శివ ఘేలా ఆలయం
సూరత్‌లోని శివ భక్తులు కూడా అలాగే నమ్ముతున్నారు. ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది. ఇక్కడి మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, పీతలను శివునికి సమర్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని చెప్తున్నారు. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారు.