భగవంతునికి సమర్పిచే ప్రసాదాలలో చిత్రాన్నం ప్రత్యేకత ఏమిటి ?

సౌభాగ్యాన్ని నిలుపుకోడానికి మహిళలు ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు ఆచరిస్తూ ఉంటారు. నోములు నోచుకున్న తరువాత వాయినమిచ్చి ముత్తైదువులు ఆశీర్వాదాలు తీసుకుంటే కలకలం సుమంగళిగా ఉంటామని నమ్ముతారు. ఇలా సౌభాగ్యం కోసం చేసే పూజల్లో పూలు, పండ్లు, ప్రసాదాలు భగవంతునికి సమర్పించి వాయినమిస్తుంటారు. అందులో ఒకటే చిత్రాన్నం.

Chitrannamఈ చిత్రాన్నాన్ని దేవికి నైవేద్యం చేసి సుమంగుళులకు శుక్రవారం దానం చేస్తే మాంగల్య దోషాలు తొలగిపోతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని పూజించి నైవేద్యం పెట్టి వృద్ధ బ్రాహ్మణ దంపతులను భోజనానికి పిలిచి ముందుగా చిత్రాన్నాన్ని వడ్డించి భోజనం తర్వాత పండ్లు దక్షిణతో కలిపి తాంబూలాన్ని అందించి నమస్కరించుకుంటే మీ దాంపత్య జీవితంలో వచ్చిన అన్ని కలహాలు, పట్టువిడుపులు, అన్నీ త్వరగా తొలగిపోయి సంసారంలో సుఖం శాంతి ఎప్పటికీ నెలకొని ఉంటుంది.

Chitrannamచిత్రాన్నాన్ని మంగళవారం సాయంత్రం చేసి శ్రీ దుర్గాదేవికి, చౌడేశ్వరి దేవికి తదితర శక్తి దేవతలకు నైవేద్యం పెట్టి తర్వాత సుమంగుళులకు మాత్రమే పంచాలి. ఇలా చేస్తే కుజదోషాలు నివారణ అవుతాయి. కుజదోషం ఉన్నవారు పూజ చేసిన రోజు మాత్రం చిత్రాన్నాన్ని తినకూడదు. ఈ రకంగా చేస్తే కుజదోషాలు త్వరగా తొలగి వివాహం అవుతుంది.

Chitrannamచిత్రాన్నాన్ని మహిళలు ధనుర్మాసంలో దేవాలయాల్లో పూజలు చేయించి, నివేదించి ప్రసాదాన్ని పంచి తాము కూడా తింటే ఇంటి యజమానికి (భర్త)కు దీర్ఘాయుషు లభిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR