భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్యప్రాంతంలో కలసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది?

హనుమంతుడు రామాయణంలోనే కాదు మహాభారతంలో కూడా ఉన్నాడని కొన్ని పురాతన కథల ఆధారంగా తెలుస్తుంది. అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్యప్రాంతంలో కలసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది? అసలు భీముడు, హనుమంతుడిని ఎందుకు కలిసాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bheemuduపాండవులు వనవాసంలో భాగంగా నారాయణాశ్రమవనంకు చేరుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది. ఆ గాలితోపాటూ దివ్యపరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపతి ఒళ్ళో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముడిని పిలిచి, ఈ పువ్వు ఎంతో అందంగా, మంచి సువాసనను వెదజల్లుతుంది. ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకు వస్తే మన కామ్యకవనంలో పెంచుకుందాం అని చెపుతుంది.

Bheemuduదౌప్రతి కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు వున్న స్థలాన్ని వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కోతి లేచి నేను పడుకొని ఉన్నాను నాకు అర్యోగం బాగాలేదు, బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్లే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్లడం సాధ్యం కాదు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో అని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది.

Hanumanఅప్పుడు భీముడు ఆ కోతి మాటలకూ ఆగ్రహానికి గురై, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి నా మార్గానికి అడ్డు రాకు తప్పుకో ఇక్కడి నుండి అని అంటాడు. ఆ సమయంలో ఆ కోతి నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్ళిపో అని అంటుంది. అయితే జంతువులను ధాటి వెళ్ళడానికి మా శాస్రం ఒప్పుకోదు కావున దారి నుండి తప్పుకోవాల్సిందే అని భీముడు కోపంగా ఆజ్ఞాపిస్తాడు. ఆ వానరం, అసలే ముసలిదానాను పైగా ఒంట్లో కూడా అసలు శక్తి లేదు, దాటి వెళ్ళడానికి శాస్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచం జరిపి నీవు దారి చేసుకొని పొమ్మని సెలవిచ్చింది. ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరుపగా అది అసలు కదులలేదు. అప్పుడు అయన బలాన్ని అంత ఉపయోగించి జరిపిన కూడా కనీసం కొంచెం కూడా తోక జరగకపోవడం తో, మీరెవరు? సిద్ధులా? దేవతలా? గంధర్వులా? నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకుంటాడు.

Hanumanసర్వలోకాలకూ ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుడ్ని , హనుమంతుడ్ని నేనే. యక్షులూ, రాక్షసులూ సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను. నీకు కావలసిన సౌగంధ వృక్షం అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు.

ఈవిధంగా భీముడు హనుమంతుడిని కలిసి ఆశీర్వాదం తీసుకొని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణం అవుతాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR