Home Unknown facts మండోదరి రావణుడి మరణం తరువాత విభీషణుడిని పెళ్లి చేసుకుందా ?

మండోదరి రావణుడి మరణం తరువాత విభీషణుడిని పెళ్లి చేసుకుందా ?

0

లంకాధిపతి రావణుడి పట్టపురాణి మండోదరి పరమ పతివ్రత. ఆమె జీవితమంతా తన భర్త కోసమే జీవించింది. మరి రాముడి చేతిలో రావణాసురుడు హతమారిన తరువాత మండోదరి ఏమైంది అనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఒక పురాణం ప్రకారం మండోదరి రావణుడి మరణం తరువాత విభీషణుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

మండోదరిరాజు మరణించాక, వారసులు కూడా లేనట్టయితే రాణిదే రాజ్యాధికారం. రామరావణుల యుద్ధంలో రావణుడితోపాటు కొడుకులు కూడా హతమారిపోయారు కాబట్టి అప్పటి లంక నియమాల ప్రకారం మండోదరిదే రాజ్యాధికారం. అందుకే మండోదరిని పెళ్లాడాలని విభీషణుడికి రాముడు సూచిస్తాడు.

ఆమెను చేపట్టడం ద్వారా అధికారాన్ని పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం. అయితే రావణుడిని ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమించే మండోదరి దీనికి తిరస్కరిస్తుంది. కానీ ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ కోసం జరిగే లాంఛనప్రాయమైన పెళ్లే కాబట్టి అంగీకరించాలని రాముడు చెప్పడంతో అంగీకరిస్తుంది. తరువాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్లి తపస్సు చేస్తూ తనువు చాలిస్తుంది.

 

Exit mobile version