Home Unknown facts రావణుడికి పుట్టుకతోనే పది తలలు ఉన్నాయా???

రావణుడికి పుట్టుకతోనే పది తలలు ఉన్నాయా???

0
హిందువులు ఎక్కువగా ఆరాధించే దైవం శ్రీరాముడు. ఇతిహాసాలలో ఎంతో పవిత్రమైనది రామాయణం. రామాయణంలో రావణాసురుడి పేరు వినగానే మనకు పది తలలతో ఉన్న ఓ రూపం మనసులో మెదులుతుంది.
సీతను ఎత్తుకుపోయి. రాముడితో యుద్ధం చేసేటప్పుడు ఈ పది తలల రూపాన్ని బయటపెడతాడు రావణాసురుడు. అయినప్పటికీ శ్రీరామ చంద్ర మూర్తి రావణాసురుడిని చంపి. సీతను తీసుకెళ్తాడు. రాక్షసుల రాజు, లంకాధిపతి అయిన రావణాసురుడికి పది తలలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.
అలా అని రావణుడుకి పుట్టుకతోనే ఆ పది తలలు వచ్చాయనుకుంటే పొరపాటే. అలాగని ఎవరూ ఆయనకు పది తలలు ఉండాలని వరం కూడా ఇవ్వలేదు. రావణాసురుడు నేర్చుకున్న కామ రూప విద్య కారణంగానే ఆయనకు పది తలలు ఏర్పడ్డాయి.
ఈ పది తలలకు తోడుగా. 20 చేతులు కూడా వస్తాయి. ప్రతి రోజూ రావణాసురుడు ఒక మొహంతోనే కనిపించేవాడు. కేవలం యుద్ధం చేసేటప్పుడే మాత్రమే ఈ పది తలల రూపాన్ని వాడుతుండేవాడని పురణాలు చెబుతున్నాయి.
ఈ పది తలలు ఆధ్యాత్మికంగా ఒక సంకేతాన్ని కూడా సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే మనస్సుకు లోబడి ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయి. ఈ పది ఇంద్రియాలనూ అదుపులో పెట్టకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలమవుతుంది.
ఈ పది ఇంద్రియాలకు లొంగిపోయినవాడే రావణుసురుడట. అందుకే విపరీతమైన కామ వాంఛ కల్గి సీతమ్మను ఎత్తుకుపోయాడు. అందు వల్లే అపార శాస్త్ర పరిజ్ఞానం, వైద్య విజ్ఞానం, మంత్ర విద్య ఉన్నప్పటకీ. రాముడి చేతిలో మరణం పొందాడు.

Exit mobile version