వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాకుండా మరొక వ్యక్తి కాలజ్ఞానం రచించారా?

0
383

అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞాన రచయిత, సాక్షాత్ దైవ స్వరూపులు అయిన, జగద్గురువు శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు, జీవసమాధి గావించిన మహాక్షేత్రం బ్రహ్మం గారి మఠం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ ఆంధ్ర ప్రదేశ్ లో వెలసిన ఈ పుణ్య క్షేత్రం కడప పట్ణణం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే 16వ శతాబ్దంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయినట్లు చెబుతారు. అంతేకాకుండా ఇప్పటికీ ఆ పోతులూరి వీరబ్రహ్మంగారు ఆ సమాధి నుంచి నిత్యం మహిమలు చూపిస్తుంటారని చెబుతారు.

Veerabrahmendra Swamyతెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యుగాంతం ఉందని నమ్మే చాలా మంది కాలజ్జానాన్ని నమ్ముతారు. ఆ కాలజ్ఞానాన్ని పోతులూరి వీరబ్రహ్మంగారు ఇక్కడే రచించారని చెబుతారు. ఈ కాలజ్జానం రచలను పామరులు సైతం ఎంతో సులభంగా అర్థం చేసుకొనేలా వీరబ్రహ్మేంద్రస్వామి రచించారు. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన 175 ఏళ్ల వయస్సులో సజీవ సమాధి అయిన స్థలమే బ్రహ్మంగారి మఠం. ఇక్కడే పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మనవరాలయిన ఈశ్వరి కూడా జీవ సమాధి అయినట్లు చెబుతారు. ఆమెను పార్వతీ దేవి ప్రతి రూపంగా భావిస్తారు. అందువల్లే ఈ క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

Veerabrahmendra Swamyవీర బ్రహ్మంగారి పెద్ద కుమారుడైన గోవిందస్వామికి పెద్ద కుమార్తే ఈశ్వరీ దేవి. ఈమెకు కశమాంబ, కలమాంబ, శరబాంబ, శంకరాంబ అనే సోదరీమణులు ఉండేవారు. తన తాతగారైన వీరబ్రహ్మేంద్రస్వామి వలే ఈశ్వరీ దేవికి చిన్న తనం నుంచి దైవ భక్తి ఎక్కువగా ఉండేది. రామాయణ, మహాభారత కథలతో పాటు వేదాల అధ్యయనం పై ఎక్కువ ఆసక్తి చూపించేది.

Veerabrahmendra Swamyఈ అమ్మవారు కూడా వీర బ్రహ్మేంద్రస్వామి వలే కాలజ్జానాన్ని రచించారు. అంతేకాకుండా ఈశ్వరీ దేవి తన జీవిత కాలంలో ఎక్కువ భాగం దేశ సంచారం కోసం వెచ్చించింది. ఇలా దేశాటన చేసే సమయంలోనే ఆమె తాను రాసిన కాలజ్జానంతో పాటు తన తాతగారైన వీరబ్రహ్మేంద్రస్వామి రచనలను కూడా ప్రజలకు తెలియజెప్పుతూ ఉండేవారు.

Veerabrahmendra Swamyఅంతేకాకుండా ఎంతోమంది కష్టాలను తన శక్తి ద్వారా పోగొట్టారు. అందుకే ఈశ్వరి తండ్రి అయిన గోవిందస్వామి తన కూతురును దైవ సమానంగా భావించేవాడు. ఒక్కొక్కసారి పూజలు కూడా చేసేవారు. దాంతో ఆమెను కూడా దేవతగా ఆరాధించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. బ్రహ్మంగారితో పాటు ఈశ్వరీ మాతను కూడా పూజించడం మొదలు పెట్టారు. ఇప్పటికి ఆమె పార్వతి దేవి అంశగా పూజలు అందుకుంటుంది.

Veerabrahmendra Swamy

 

SHARE