ఆరోగ్యాన్ని చేకూర్చే ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి తెలుసా ?

0
292

వేలాది సంవత్సరాల నుండి ఆపిల్ సైడర్ వెనిగర్ వైద్య పరంగా వాడుతున్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి అద్భుతంగా పని చేస్తోంది. బరువు తగ్గడానికి 8000 BC నాటి నుంచే ఈజిప్షియన్లు దీనిని ఉపయోగించేవారు. అంతెందుకు మొదటి ప్రపంచయుద్ధంలో గాయపడిన సైనికులకి గాయాలు తగ్గడానికి ఔషధంగా ఆపిల్ సైడర్ వెనిగర్ నే ఉపయోగించేవారు.

Benefits of Apple Cider Vinegarఈ పురాతనమైన ఆరోగ్య ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ నీ పులియబెట్టి తయారుచేస్తారు. దీన్ని రోజు వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం,రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.

Benefits of Apple Cider Vinegarరోజూ ఉదయాన్నే ఆపిల్ వెనిగర్ నీటితో కలిపి తీసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతే కాదు షుగర్ ఉన్నవాళ్లకు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. గుండెల్లో ఏర్పడే చెడు కొలస్టాల్ కూడా ఇది తగ్గిస్తుంది.

Benefits of Apple Cider Vinegarపొట్ట భాగంలో అధిక కొవ్వును తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. ఇందులో ఉన్న ఎసిటిక్ ఆమ్లం ఉదర కొవ్వు, శరీర బరువు, మరియు నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

Benefits of Apple Cider Vinegarఆపిల్ సైడర్ వెనిగర్ ఘాటయిన రుచి కలిగి ఉండి త్రాగడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి దాల్చినచెక్కను దీనికి జోడించడం వల్ల మంచి రుచిని ఇస్తుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, గుండె జబ్బులును తగ్గిస్తుంది.

 

SHARE